Motivation: ఈ గాడిద కథ చదివితే మీ ఆలోచన మారాల్సిందే

Published : Feb 05, 2025, 10:07 AM ISTUpdated : Feb 05, 2025, 11:26 AM IST

కొన్నిసార్లు జీవితంలో చేయని తప్పుకు కూడా నిందలు మోయాల్సి వస్తుంది. దీంతో మనకు తెలియకుండానే కుంగిపోతుంటాం. జీవితంలో నైరాశ్యానికి గురవుతుంటాం. అయితే ఎంతటి నిందలు మనపై పడ్డా, ఆ నిందనలను ఆయుధాంగా మార్చుకొని ఎదగవచ్చు. ఇందుకు నిదర్శనమే ఈ గాడిద కథ. ఇంతకీ ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..   

PREV
14
Motivation: ఈ గాడిద కథ చదివితే మీ ఆలోచన మారాల్సిందే
Motivation story

ఓ గాడిద నడుచుకుంటూ, నడుచుకుంటూ వెళ్తూ పొరపాటిన ఎండిపోయిన ఓ లోతైన బావిలో పడుతుంది. ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోతుంది. దీంతో మౌనంగా గంటల తరబడి బావిలోనే ఉంటుంది. అయితే రైతు ఆ గాడిదను బయటకు తీసేందుకు ఎన్నో రకాల ప్రయాత్నాలు చేస్తాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా గాడిదను పైకి తీసుకురాలేకపోతాడు. దీంతో చేసేది ఏం లేక గాడిదను అక్కడే వదిలేస్తాడు. 

24
Motivation story

గాడిద ఎలాగో ముసలిది అయ్యింది. దాంతో పని ఏం లేదని నిర్ణయించుకుంటాడు. అలాగే బావి కూడా నీరు లేక ఎండిపోయిందని, ఇక ఆ బావితో ఉపయోగం లేదని ఓ నిర్ణయానికి వస్తాడు. గాడిదను కాపాడడం కోసం చేసే ప్రయత్నం విఫలమని అనుకొని ఆ బావిని మట్టితో కప్పేసి గాడిదలను అందులోని పాతిపెట్టాలని నిర్ణయించుకుంటాడు. అక్కడే ఉన్న కొంత మంది సహాయంతో బావిలోకి మట్టిపోయడం ప్రారంభిస్తారు. 

మొదట గాడిద భయంతో అరుస్తుంది. ఏం చేయాలో తెలియక భయపడుతుంది. అయితే కాసేపటికే గాడిద అరుపులు ఆగిపోతాయి. గాడిద చనిపోయందనుకున్న రైతు బావిలోకి చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. గాడిద తనపై పడుతోన్న మట్టిని నేర్పుగా కుదుపుకొని, దానిపై నడుస్తూ ఎంచక్కా బావిపైకి వచ్చేస్తుంది. అలా మట్టి వేస్తున్నా కొద్దీ నెమ్మదిగా పైకి ఎక్కిన గాడిద చివరికి అందరి ముందు బయటకు వచ్చి మట్టిని దులిపేసుకొని నవ్వుతూ వెళ్లిపోతుంది. 

34
Sucess in life


గొప్ప సందేశం:

ఇదండి.. వినడానికి కథలాగే ఉన్నా ఇందులో ఎంతో నీతి దాగి ఉంది. మన జీవితానికి అన్వయించుకోవాలే కానీ పెద్ద పెద్ద మోటివేషనల్‌ స్పీచర్స్‌ కూడా పనికిరారు. ఆ గాడిదపై మట్టి వేసినట్లే. జీవితంలో మనపై కూడా చాలా మంది నిందలు వేస్తుంటారు. జీవితంలో విజయం సాధిస్తున్న మనల్ని కిందికి లాగడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే వాటిని పట్టించుకోకుండా, దులుపేసుకుంటూ, అవకాశాలుగా మార్చుకుంటూ మన లక్ష్యంవైపు అడుగులు వేయాలనే గొప్ప సందేశం ఈ కథలో ఉంది. జీవితంలో ఎంత లోతుకు కూరుకుపోయినా పైకి రావడానికి అవసరమైన శక్తి మీలోనే ఉంటుంది. ధైర్యంతో ఒక్కో అడుగు వేస్తూ జీవితంలోకి పైకి రావొచ్చు. 
 

44
How to be happy

ఆనందంగా జీవించాలా.? 

ఆనందంగా జీవించడానికి డబ్బు కావాలని చాలా మంది భావిస్తుంటారు. అయితే కేవలం 5 విషయాలను పాటిస్తే చాలు, సంతోషం మీకు సలాం కొడుతుంది, ఆనందం మీ ఇంటి అడ్రస్‌ అవుతుంది. ఇంతకీ ఆ 5 విషయాలు ఏంటంటే.. 

* క్షమించడాన్ని అలవాటు చేసుకోండి. ఇలా చేస్తే మనుసు హాయిగా ఉంటుంది. అనవసరమైన ఎమోషన్స్‌ నుంచి మనసు బయటపడుతుంది, ప్రశాంతంగా ఉంటుంది. 

* జీవితాన్ని సింపుల్‌గా బతకడాన్ని అలవాటు చేసుకోండి. అవసరం లేని భారాన్ని మోయం వదిలేయండి, అవసరమైన దాన్ని మాత్రమే మనసులో నింపుకోండి. 

* ఆశలు తగ్గించుకోండి. ఎక్కువ ఆశలు ఏదో ఒక సమయంలో నిరాశకు దారి తీస్తుందన్న సత్యాన్ని గుర్తుంచుకోండి. 

* అశాంతిని కలిగించే విషయాల నుంచి దూరంగా ఉండండి. మనసుకు శాంతినిచ్చే అంశాలకే ప్రాధాన్యత ఇవ్వండి.

* ప్రేమించే గుణాన్ని పెంచుకోండి. ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా సరే ధైర్యంగా, సహనంతో ఎదుర్కోండి. సంతోషంతోనే సమస్యలను పరిష్కరించుకోండి. 
 

click me!

Recommended Stories