ఈరోజు శ్రీకృష్ణాష్టమి. ఈ పండుగ రోజున శ్రీకృష్ణుడికి ఎనిమిది సార్లు నైవేద్యాన్ని సమర్పించాలి. కానీ చాలా తక్కువ మందికే ఈ విషయం తెలుసు. ఇలా శ్రీకృష్ణుడికి ఎనిమిది సార్లు నైవేద్యం ఎందుకు సమర్పించాలో తెలుసుకోండి.
కృష్ణ భక్తులకు జన్మాష్టమి అతి పెద్ద పండుగ. ప్రతి ఏడాది భాద్రపద కృష్ణ పక్ష అష్టమి తేదీన జన్మాష్టమి పండుగ నిర్వహించుకుంటాము. ఈ సంవత్సరం జన్మాష్టమి ఆగస్టు 16న వచ్చింది. ఈరోజే శ్రీకృష్ణుడు జన్మించిన రోజు. పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు రోహిణి నక్షత్రంలో జన్మించాడు. కాబట్టి రోహిణి నక్షత్రం వారికి ఈ రోజున ఎంతో మేలు జరిగే అవకాశం ఉంది. జన్మాష్టమి నాడు శ్రీకృష్ణుడిని బాలుడు రూపంలోనే పూజిస్తారు. అతడికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పిస్తారు. అయితే ఎక్కువ మందికి తెలియని విషయం ఏమిటంటే జన్మాష్టమి నాడు శ్రీకృష్ణుడికి ఎనిమిది సార్లు నైవేద్యాన్ని సమర్పించాలి. అలా ఎందుకు సమర్పించాలో తెలుసుకోండి.
25
8తో అనుబంధం
శ్రీకృష్ణుడు భాద్రపద మాసంలో అష్టమ తిథినాడు జన్మించాడని అందరికీ తెలిసిన విషయమే. అంటే ఎనిమిదవ సంఖ్యతో ఆయన పుట్టుకకు నేరుగా అనుబంధం ఉంది. అందుకే జన్మాష్టమి నాడు ఆయనకు ఎనిమిది సార్లు ఆహారాన్ని అందించాలని చెబుతారు. ఈ సాంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది. కానీ ఇప్పటి తరానికి ఈ విషయం తెలియదు.
35
రోజులో ఎనిమిది సార్లు నైవేద్యం
శ్రీకృష్ణుడిని ఈరోజు పూజించడం వల్ల అష్ట సిద్ధులు, అష్టైశ్వర్యాలు పొందుతారని చెబుతారు. అలాగే ఎనిమిది సార్లు నైవేద్యం సమర్పించడం వల్ల ఎన్నో వరాలను కూడా పొందచ్చని వివరిస్తున్నారు. మత విశ్వాసాల ప్రకారం ఒక పగలు, రాత్రిలో ఎనిమిది కాలాలు ఉంటాయి. ఎనిమిది కాలాలలో ఎనిమిది సార్లు ఆహారం అందించడం భక్తులు మర్చిపోకూడదు. కాబట్టి శ్రీకృష్ణుడికి ఎనిమిది సార్లు ఈరోజు ఆహారం పెట్టేందుకు ప్రయత్నించండి.
45
ఎనిమిది మంది గోపికలు
కృష్ణుడి బాల్యము, యవ్వన కాలంలో తన చుట్టూ ఎనిమిది మంది ప్రధాన గోపికలు ఉండేవారని అంటారు. ఇది కూడా 8 అంకెతో అనుబంధం కలిగి ఉన్నదే. అందుకే ఎనిమిది సార్లు ఆహారం అందించడం అనేది శ్రీకృష్ణుడు జ్ఞాపకాలకు గౌరవం ఇవ్వడంతో సమానము.
55
ఏం నైవేద్యాలు పెట్టాలి?
ఇక జన్మాష్టమికి శ్రీకృష్ణుడికి సమర్పించే 8 రకాల ప్రసాదాలు ఏం పెట్టాలంటే... అతడికి అవి ఎంతో ఇష్టమైనవై ఉండాలి. పంజిరి, మఖన్ మిస్రీ అంటే పటికతో చేసిన పదార్థాలు, పండ్లు, పాలు, పంచామృతం, వెన్న, చక్కెర, డ్రై ఫ్రూట్స్, స్వీట్లు వంటివి శ్రీకృష్ణుడు ఇష్టంగా తింటాడు. వీటిని రోజులో 8సార్లు ఇచ్చేందుకు ప్రయత్నించండి. శ్రీకృష్ణుడి కృపాకటాక్షాలు మీపై కలుగుతాయి.