రోటీలు, చపాతీలు, పూరీలు బాగా రావాలి అంటే.. అది మనం పిండి కలిపే విధానం మీదే ఆధారపడి ఉంటాయి. అయితే... చాలా మందికి పిండి కలపడం సరిగా రాదు. చాలా మంది పిండి కలిపేటప్పుడు లూజుగా అవుతుంది. చేతులకు జిగటగా అంటేస్తుంది. కొంచెం నీరు ఎక్కువైనా పండి అలా అయిపోతుంది. ఇలా అయినప్పడు పిండి కలపడం చాలా మందికి చిరాకుగా అనిపిస్తుంది. అంతేనా.. పిండి ఇలా లూజుగా అయినప్పుడు.. చపాతీలు, రోటీలు చేసినా కూడా రావు. మరి.. ఇలా కాకుండా ఉండాలంటే.. ఏం చేయాలో తెలుసా? పిండి పలుచగా ఉన్నా... రోటీలు సరిగా రావాలంటే ఈ కింది చిట్కాలు పాటిస్తే చాలు. అవేంటో ఇప్పుడు చూద్దాం..