Simple Rangoli: కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు రంగురంగుల ముగ్గులు వేసేందుకు మహిళలంతా సిద్ధమైపోతారు. ఇక్కడ మేము కొన్ని ముగ్గులు ఇచ్చాము. వీటిని వేయడం చాలా సులువు.
న్యూ ఇయర్ రోజు ఇంటి ముందు రంగోలీ వేయడం శుభసూచకంగా చెప్పుకుంటారు. కొత్త సంవత్సరం ఆనందం, ఆశలు, శుభఫలితాలు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ రంగోలీ వేస్తారు. ఇంటి ప్రవేశద్వారం దగ్గర అందంగా వేసిన రంగోలీ ఇంటికి సానుకూల శక్తిని ఆహ్వానిస్తుందని నమ్మకం. అందుకే న్యూ ఇయర్ ఉదయం చాలా కుటుంబాలు ముందుగా ఇంటిని శుభ్రం చేసి రంగోలీ వేస్తారు. ఇది సంప్రదాయం మాత్రమే కాకుండా ఒక మంచి అలవాటు కూడా. ఇక్కడ ఇచ్చిన ముగ్గును మీరు కేవలం చుక్కలు లేకుండా గీతలతో వేసేయవచ్చు
25
రంగోలీ డిజైన్లు
న్యూ ఇయర్ రంగోలీల్లో సాధారణంగా పూల ఆకృతులు, దీపాల బొమ్మలు ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే హ్యాపీ న్యూ ఇయర్, కొత్త సంవత్సరం అంకెలు, నక్షత్రాలు, వృత్తాకార డిజైన్లు కూడా వేస్తారు. కొంతమంది రంగోలీలో రంగురంగుల పూలు పెట్టి ప్రత్యేక ఆకర్షణ కలిగిస్తారు. ఇక్కడిచ్చిన గులాబీ పూల ముగ్గు మరింత అందంగా కనిపిస్తుంది.
35
రంగోలీకి ఉపయోగించే రంగులు
న్యూ ఇయర్ రంగోలీలో ప్రకాశవంతమైన రంగులు వాడటం ఆనందాన్ని సూచిస్తుంది. పసుపు, ఎరుపు, ఆకుపచ్చ, నీలం, గులాబీ రంగులు ఎక్కువగా ఉపయోగిస్తారు. పసుపు శుభాన్ని, ఎరుపు శక్తిని, ఆకుపచ్చ కొత్త ఆరంభాన్ని సూచిస్తాయి. సహజ రంగులు లేదా పూల రేకులు వాడితే ఇంటి వాతావరణం మరింత ప్రశాంతంగా మారుతుంది. ఈ ముగ్గును ఇంటి ముందు వేస్తే ఎంతో నిండుగా ఉంటుంది.
45
మందార పూల రంగోలీ
న్యూ ఇయర్ రంగోలీలో ఈ మందార పూల డిజైన్లు అందంగా ఉంటాయి. వీటిని కేవలం గీతలతో వేసేయవచ్చు. రంగులు వేస్తే ఈ ముగ్గు ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. కుటుంబ సభ్యులంతా కలిసి రంగోలీ వేస్తే ఆ రోజు మరింత ఆనందంగా గడుస్తుంది.
55
నాలుగు గులాబీ పూల ముగ్గు
ఎక్కువ మంది ఇంటి ముందు గులాబీ పూల ముగ్గు వేసేందుకు ఇష్టపడతారు. ఇది ఒక మరొక గులాబీ పూల ముగ్గు. రంగోలీ కేవలం అలంకరణ మాత్రమే కాదు. ఇది కొత్త సంవత్సరానికి శుభాకాంక్షల సూచికగా నిలుస్తుంది. ఇంటి ముందు రంగోలీ చూసినవారికి కూడా ఆనందం కలుగుతుంది. ఇలాంటి ముగ్గు వేస్తే ఎవరికైనా నచ్చేస్తుంది.