హస్త ప్రయోగం ఎక్కువగా చేస్తున్నారా?

Published : Jun 25, 2023, 10:39 AM IST

హస్త ప్రయోగంతో ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని చాలా మంది చెప్తుంటారు. అది నిజమే అయినప్పటికీ.. దీన్ని మరీ ఎక్కువగా చేయడం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.   

PREV
16
 హస్త ప్రయోగం ఎక్కువగా చేస్తున్నారా?

హస్త ప్రయోగానికి భాగస్వామి ఉండాల్సిన అవసరం లేదు. ఇది మంచి కూడా  మంచి అనుభూతిని కలిగిస్తుంది. సంతృప్తినిస్తుంది. ఆహ్లాదకరంగా ఉంటుంది. అంతకు మంచి ఇది సురక్షితమైనది కూడా. అలాగే   ఇది  మీ లైంగిక చురుకుదనాన్ని నిర్ధారిస్తుంది. అందుకే ఆరోగ్యకరమైనదిగా పరిగణిస్తారు. అందుకే ప్రస్తుతం యువత హస్త ప్రయోగం పట్ల ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఈ హస్త ప్రయోగం చేయడంలో తప్పేమీ లేదు కానీ.. దీన్ని మరీ ఎక్కువగా చేస్తేనే ఎన్నో సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. హస్త ప్రయోగంతో ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..

26

మిమ్మల్ని బాధించొచ్చు

మరీ ఎక్కువగా హస్త ప్రయోగం చేయడం వల్ల మీరు గాయపడొచ్చు. అంటే దీనిలో ఎక్కువగా పాల్గొంటే యోని లేదా పురుషాంగం చర్మం చిట్లుతుంది. ఇది చిన్న గాయమే అయినా కొన్ని సందర్భాల్లో పెరోనీ వ్యాధికి కూడా కారణమవుతుందని నిపుణులు అంటున్నారు. అంటే అధిక స్ట్రోకింగ్ కారణంగా పురుషాంగం షాఫ్ట్‌లో ఫలకం ఏర్పడుతుంది. అందుకే మిమ్మల్ని మీరు బాధించుకుంటే ఫ్రీక్వెన్సీని తగ్గించండి. 
 

36
masturbating

మీరు ఒత్తిడికి గురికావొచ్చు

ఎక్కువగా హస్త ప్రయోగం చేయడం వల్ల మీ సామాజిక జీవితం ఎంతో ప్రభావితం అవుతుంది. తరచుగా హస్త ప్రయోగం చేయడం వల్ల మీరు బయటకు వెళ్లలేరు. ఇది మీ మానసిక ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఏదేమైనా ఇది సాధారణ లైంగిక కార్యకలాపాల కిందికి రాదు కాబట్టి మీరు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. 
 

46

లైంగిక జీవితాన్ని ప్రభావితం చేస్తుంది

హస్త ప్రయోగం మీ లైంగిక జీవితాన్ని ఎంతో ప్రభావితం చేస్తుందని నిపుణులు అంటున్నారు. నిజం చెప్పాలంటే హస్త ప్రయోగం లైంగికంగా చురుకుగా ఉండటానికి బాగా సహాయపడుతుంది. కానీ దీన్ని అతిగా చేస్తుంటే అది మీ లైంగిక జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే మీ యోని లేదా పురుషాంగాన్ని ఎక్కువగా రుద్దడం లేదా తడమటం మీ మెదడుకు సోలో చర్యను నేర్పుతుంది. అలాగే మీరు దీన్ని ఎక్కువగా చేసిన తర్వాత మీ మెదడు, మీ శరీరం దీన్నే ఎక్కువగా కోరుకుంటుంది. ఇది మీ భాగస్వామితో మీ లైంగిక సంబంధాన్ని ప్రభావితం చేస్తుంది.
 

56
masturbation

అపరిశుభ్రమైన సెక్స్ టాయ్స్ వాడితే..

హస్త ప్రయోగంలో చాలా మంది సెక్స్ టాయ్స్ ను ఉపయోగిస్తుంటారు. అయితే అపరిశుభ్రమైన ట్యాయ్స్ ను ఉపయోగిస్తే బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్లు సోకుతాయ. కాబట్టి మీరు వీటిని  ఉపయోగించే ముందు శానిటైజ్ , శుభ్రంగా ఉంచండి. అలాగే ఎక్కువ మంది భాగస్వాములతో వాటిని ఉపయోగించడం మానుకోండి. ఇది లైంగిక అంటువ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఇవి మీకు ఆనందం కంటే ఎక్కువ హాని చేస్తాయి.
 

66

వ్యసనపరులు కావొచ్చు

ఇది కేవలం హస్త ప్రయోగంతో మాత్రమే కాదు.. ఇది ఒక వ్యసనంలా మారతుంది తెలుసా? ఎందుకంటే ఇది నియంత్రణ కోల్పోయేలా చేస్తుంది. ఇది దీర్ఘకాలికంగా మీ శ్రేయస్సును దెబ్బతీస్తుంది. అందుకే దీన్ని అలవాటులా మార్చుకోకండి. 

Read more Photos on
click me!

Recommended Stories