సింపుల్ పద్ధతులు..
ఉల్లిపాయ, వెల్లుల్లి ఘాటు స్ప్రే: ఉల్లిపాయలు, వెల్లుల్లిలో ఉండే ఘాటైన వాసనను బల్లులు అస్సలు తట్టుకోలేవు. కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలను గ్రైండ్ చేసి నీటిలో కలిపి ఒక స్ప్రే బాటిల్‌లో తీసుకోండి. బల్లులు ఎక్కువగా తిరిగే కిటికీలు, తలుపుల మూలల్లో, ట్యూబ్‌లైట్ల వెనుక దీనిని స్ప్రే చేస్తే ఆ ఘాటుకు బల్లులు ఇటువైపు కూడా రావు.
2. హోమ్‌మేడ్ నల్ల మిరియాల స్ప్రే: నీటిలో రెండు చెంచాల నల్ల మిరియాల పొడి లేదా కారం పొడి కలిపి స్ప్రే తయారుచేసుకోండి. ఈ మిశ్రమం బల్లుల చర్మానికి, కళ్లకు తీవ్రమైన చికాకును కలిగిస్తుంది. బల్లులు కనిపించే ప్రదేశాల్లో దీనిని చల్లితే, అవి ఆ ప్రాంతాన్ని వదిలి వెంటనే పారిపోతాయి.
3. కోడిగుడ్డు పెంకుల ట్రిక్: కోడిగుడ్డు పెంకుల నుంచి వచ్చే ప్రత్యేకమైన వాసన బల్లులకు నచ్చదు. అంతేకాకుండా, ఆ పెంకులను చూసి తమ కంటే పెద్ద జీవులు ఏవైనా ఉన్నాయేమోననే భయంతో బల్లులు ఆ ప్రాంతానికి రాకుండా దూరంగా ఉంటాయి. గుడ్డు పెంకులను శుభ్రం చేసి ఇంట్లోని మూలలు , కిటికీల దగ్గర ఉంచితే బల్లులు పారిపోతాయి..