Health: వర్షాకాలంలో అల్లం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా.. ఇంతకు అవేంటంటే?

Published : Jun 24, 2023, 12:20 PM IST

Helath: వర్షాకాలం ఎక్కువగా గొంతు సమస్యలు, డైజేషన్ సమస్యలు బాధిస్తూ ఉంటాయి. దీనికి పరిష్కారం అల్లం అని వైద్య నిపుణులు అంటున్నారు. ఇంతకు దాని ఉపయోగం ఏంటో తెలుసుకుందాం.  

PREV
16
Health: వర్షాకాలంలో అల్లం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా.. ఇంతకు అవేంటంటే?

వర్షాకాలం వస్తుందంటేనే మనం సాధారణంగా ఎదుర్కొనే సమస్యలు జలుబు, దగ్గు ఇంకా తిన్నది పూర్తిగా అరగకపోవటం. అయితే ఆహారంలో తరచుగా అల్లాన్ని తీసుకోవటం ద్వారా ఇలాంటి చిన్న చిన్న సమస్యలను అధిగమించవచ్చు అని మన అమ్మమ్మల ద్వారా మనం తెలుసుకున్నదే.

26

అయితే ప్రతి చిన్న విషయానికి మెడిసిన్ మీద ఆధారపడే నేటి తరానికి ఈ విషయం మీద పెద్దగా అవగాహన ఉండి ఉండకపోవచ్చు. అందుకే ఓసారి అల్లం ప్రయోజనం మీద లుక్కేద్దాం. ఇక అల్లం విషయానికి వస్తే ప్రతి భారతీయ దీనికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.

36

దీనిని నిత్యం ఆహారంలో వాడటం వల్ల మనకి తెలియకుండానే సగం రోగాలు మటుమయమవుతాయి. అల్లం లో సహజంగా జంజిరల్ అనే సన్మానం ఉంటుంది ఇది జీర్ణక్రియని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. అందువల్ల మనకి డైజేషన్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి.

46

అల్లం ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ లేదా చెడు కొలెస్ట్రాల్ స్థాయిలని తగ్గించడంలో సహాయపడుతుంది. గుండె మంటగా కనిపించినప్పుడు అల్లం టీ తీసుకోవటం అనేది ఎప్పటినుంచో వస్తున్న ఆచారమే. అల్లం వాపును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఆర్థరైటిస్ లక్షణాల చికిత్సకు కూడా ఉపయోగపడుతుంది.

56

రోజు ఆహారంలో తీసుకోవడం ద్వారా నొప్పి మరియు వాపు నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇక ఈ అల్లని టీ రూపంలో మనం తీసుకోవచ్చు తర్వాత స్మూతీస్ లో కూడా ఈ అల్లాన్ని కలపటం వల్ల తగిన రుచితో పాటు మీ గట్ క్లీనింగ్ లో మీకు సహాయం చేస్తుంది. ఇక అల్లం జామ్ చేసి పిల్లలకి పెట్టడం ద్వారా వాళ్లు ఇష్టంగా దీనిని తింటారు.

66

అలాగే అల్లం పచ్చడి అల్లం ఊరగాయ కూడా పెట్టుకొని సంవత్సరం మొత్తం మన ఆహారంలో భాగం చేసుకోవచ్చు. మీరు రక్తాన్ని పలుచన చేసే మందులను కలిగి ఉన్నట్లయితే అల్లం మరింత రక్తం సన్నబడటానికి కారణం అవుతుంది కాబట్టి బ్లడ్ తిన్నర్ మెడిసిన్ వాడేవారు అల్లం వాడకం విషయంలో వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

click me!

Recommended Stories