Motivational story: ఈ కథ చదివితే మీ ఆలోచన మారడం ఖాయం.. ఇకపై తొందరపాటు నిర్ణయాలు చచ్చినా తీసుకోరు

Published : Mar 18, 2025 8:06 PM ISTUpdated : Mar 19, 2025 4:02 PM IST

కథలు జీవితానికి సరిపడ సందేశాలను అందిస్తాయి. చిన్న కథల్లోనే గొప్ప సందేశాలు ఉంటాయి. అలాంటి ఒక మంచి స్ఫూర్తివంతమైన కథ గురించి ఈరోజు తెలుసుకుందాం..   

13
Motivational story: ఈ కథ చదివితే మీ ఆలోచన మారడం ఖాయం.. ఇకపై తొందరపాటు నిర్ణయాలు చచ్చినా తీసుకోరు
Motivational story

ఒక అడవిలో సింహం ఉండేది. అన్ని జంతువుల కంటే తానే బలమైన దానినని విర్రవిగుతూ ఉండేది. తన ప్రతాపాన్ని చిన్న చిన్న జంతువులపై చూపిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉండేది. దీంతో అడవిలో జంతువులన్నీ ఈ సింహం పీడ విరగడైతే బాగుంటుందని ఆశిస్తుంటారు. 

సింహం అరాచకాలు ఇలాగే కొనసాగుతోన్న తరుణంలో సింహం ఓ రోజు చెట్టు కింద ప్రశాంతంగా నిద్రపోతుంటుంది. అయితే ఇదే సమయంలో చెట్టు కొమ్మ విరిగి సింహం తలపై పడుతుంది. దీంతో సింహం స్పృహ తప్పి పడిపోయింది. కాసేపటి లేచిన సింహం తలకు బలమైన గాయం కావడంతో గతం మర్చిపోతుంది. చిన్న జంతువులపై ప్రతాపం చూపుతూ అరాచకం చేసే సింహం ఒక్కసారిగా సైలెంట్‌ అయిపోతుంది. 

23
Telugu story

ఒక చోట సైలెంట్‌గా కూర్చుంటుంది. దీంతో అడవిలో జంతువులన్నీ ఆశ్చర్యపోతాయి. సింహం ఇలా మారిపోయిందేంటి అని ఆలోచిస్తుంటాయి. జరిగిందంతా తెలుసుకొని హమ్మయ్యా సింహం నుంచి ఉపశమనం లభించింది అని హ్యాపీగా ఫీలవుతుంటాయి. అయితే ఇంతలోనే అటుగా వచ్చిన నక్క. ఇన్ని రోజులు ఈ సింహంతో నేను నరకం అనుభవించాను. బలహీనమైన నాపై దాడికి దిగేది అంటూ వాపోతుంది. 

సింహంపై ప్రతికారం తీర్చుకోవడానికి ఇదే సరైన సమయమని భావించిన నక్క.. సింహంపై దాడి చేయడానికి సిద్ధమవుతుంది. ఇప్పుడు సింహాన్ని కొట్టినా ఏం కాదని అందరం కలిసి కసితీరా కొడదాం అంటుంది. దీంతో అక్కడే ఉన్న జంతువులు.. అలా చేయొద్దంటూ వారిస్తాయి. ఇప్పుడు మనకు సింహంతో ఎలాంటి ఇబ్బంది లేదు కదా, దానిపై దాడి చేయాల్సిన అవసరం లేదంటాయి. 
 

33
Telugu Story

అయితే నక్క జంతువుల మాట వినకుండా పెద్ద కర్రను తీసుకొని సింహం తలపై ఒక్క దెబ్బ వేస్తుంది. దీంతో సింహం మరోసారి స్పృహతప్పి పడిపోతుంది. కాసేపటికి లేచిన సింహానికి గతం గుర్తొస్తుంది. దీంతో మళ్లీ జంతువులపై ఆధిపత్యాన్ని ప్రదర్శించడం ప్రారంభిస్తుంది. గర్జిస్తూ.. జంతువుల మీదకు దూకి అటాక్‌ చేస్తుంది. ఇలా నక్క తొందరపాటు మొదటికే మోసంగా మారుతుంది. 

నీతి: మనం కూడా కొన్ని సందర్భాల్లో ఇలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాం. సరైన ఆలోచన లేకుండా చేసే పనులు కష్టాలను తీసుకొస్తాయి. అందుకే ఏ పని చేసినా ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేయాలని చెబుతుంటారు. 

click me!