గంగా నదిలో మునిగితే సకల పాపాల నుంచి విముక్తి లభిస్తుందని అందరూ నమ్ముతారు. గంగను నదిలా కాకుండా ఒక తల్లిలా భావిస్తారు.
పురణాల ప్రకారం బ్రహ్మలోకంలో జరిగిన ఓ సంఘటన వల్ల గంగామాత శాపగ్రస్తురాలైందట. అందుకే భూమిపై జన్మించాల్సి వచ్చిందట.
ఇక్ష్వాకు వంశపు రాజు మహాభిష మరణం తర్వాత బ్రహ్మలోకానికి వెళ్ళాడట. అతను చేసిన యాగాల ఫలితంగా దేవలోకంలో స్థానం లభించిందని పురణాలు చెబుతున్నాయి.
పురణాల ప్రకారం బ్రహ్మలోకంలో గంగామాత కూడా ఉంటుంది. సభ జరుగుతున్నప్పుడు గాలికి గంగాదేవి చీర ఎగిరిపోతుందట.
దేవతలు తలలు దించుకోగా, మాహాభిష మాత్రం గంగాదేవి అందాన్ని చూసి ముగ్ధుడయ్యాడట. గంగాదేవి కూడా అతన్నే చూస్తూ ఉందట.
అప్పుడు బ్రహ్మదేవుడు మహాభిషను, గంగాదేవిని భూమిపై జన్మించి.. పాపాన్ని పోగొట్టుకోవాల్సిందిగా శపించాడట.
దీంతో మహాభిష.. శంతనుడిగా, గంగామాత.. గంగాదేవిగా జన్మించారట. వారి కుమారుడే భీష్ముడని పురాణాలు చెబుతున్నాయి.
Kavitha G