గర్భం వచ్చే ముందు కనిపించే లక్షణాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!

Published : Jun 11, 2022, 01:35 PM IST

మాతృత్వం అనేది మహిళలకు గొప్ప వరం లాంటిది. ఈ మధురమైన క్షణాల కోసం వివాహమైన ప్రతి మహిళ ఎన్నో కలలు కంటుంది. 

PREV
17
గర్భం వచ్చే ముందు కనిపించే లక్షణాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!

గర్భం నిర్ధారణ కాగానే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మరింతగా ఆలోచిస్తుంది. అయితే మరీ గర్భం నిర్ధారణ అయిందని ఎలా తెలుసుకోవాలో చాలా సందేహాలు వారిలో కలుగుతుంటాయి. ఇలా వారిలోని సందేహాలకు ఎటువంటి పరీక్షలు లేకుండా గర్భం వచ్చే ముందు కనిపించే లక్షణాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

27

గర్భం వచ్చే ముందు కనిపించే లక్షణాలు అందరి మహిళల్లోనూ ఒకే విధంగా ఉండవు. అయితే చాలా వరకూ కొన్ని లక్షణాలు మాత్రం అందరిలోనూ ఒకే విధంగా ఉంటాయి. ఈ లక్షణాలను బట్టి వారికి గర్భం నిర్ధారణ అయిందని చెప్పవచ్చు. దీంతో వారు ఎటువంటి నిర్ధారణ పరీక్షలు లేకుండా సులభంగా గుర్తించవచ్చును.

37

పీరియడ్స్ ఆగిపోవడం: గర్భధారణ నిర్ధారణ అయిందని మహిళల్లో మొదటగా కనిపించే లక్షణం పీరియడ్స్ ఆగిపోవడం. క్రమం తప్పకుండా వచ్చే పీరియడ్స్ ఆలస్యంగా రావడం. ఇలా పిరియడ్స్ ఆలస్యంగా వస్తే గర్భధారణ ప్రారంభ దశగా భావించాలి. 

 

47

నీరసం: ఏ చిన్న పని చేసిన త్వరగా అలసిపోయి నీరసంగా అనిపించడం, అసలు ఏ పని చేయకపోయినా శరీరం నీరసంగా ఉండడం గర్భం వచ్చే ముందు సంకేతాలు. ఇందుకు కారణం శరీరంలో జరిగే హార్మోన్ల మార్పులు. ఈ హార్మోన్ల మార్పుల కారణంగా శరీరం త్వరగా అలసిపోయి నీరసంగా ఉంటుంది.

 

57

వాసన పడకపోవడం: గర్భధారణ సమయంలో వాసనను గ్రహించే శక్తి అధికంగా           ఉంటుంది. అయితే చాలా మంది మహిళలకు కొన్ని వాసనలు పడకపోవడం జరుగుతుంది. దీంతో వారు ఎంతో ఇష్టంగా తినే ఆహార పదార్థాలు అయినప్పటికీ వాటిమీద అయిష్టత చూపుతారు. అలాంటప్పుడు వారు ఆ పదార్థాలను వండడానికి కూడా ఇష్టపడరు.

 

67

వాంతులు అవ్వడం: గర్భధారణ ప్రారంభ దశలో ఉదయం పూట వికారంగా ఉంటుంది. దీంతో వాంతులు కూడా అవుతుంటాయి. ఒక్కొక్కసారి నోటికి ఏ ఆహార పదార్థాలు రుచిగా అనిపించవు. దీంతో కడుపులో తిప్పినట్లు అనిపించి వాంతులు అవుతుంటాయి. ఇలా వాంతులు అవుతుంటే గర్భం దాల్చారని భావించాలి.

 

77

శ్వాస తీసుకోవడంలో మార్పులు: గర్భం ధారణ సమయంలో శ్వాస తీసుకోవడంలో కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే గర్భంలో పెరుగుతున్న పిండంకు శ్వాస అవసరమవుతుంది. దీంతో మీలో శ్వాస తీసుకోవడంలో మార్పులు కలుగుతాయి. ఈ  లక్షణం కూడా గర్భ నిర్ధారణకు సంకేతం. 

click me!

Recommended Stories