బరువు ఎక్కువగా ఉంటే పిల్లలు పుట్టరనేది నిజమేనా..?

First Published | Mar 25, 2022, 12:42 PM IST

ఓవర్ వెయిట్ ఉంటే కూడా పిల్లలు పుట్టరని చాలా మంది అంటూ ఉంటారు. అది నిజమేనా? దీనిపై వైద్యులు ఏమంటున్నారో తెలుసుకుందాం పదండి.. 

ప్రస్తుత కాలంలో చాలా మంది కపుల్స్ సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు. సరైన వయసులో పెళ్లి చేసుకున్నా.. పిల్లలు కలగని వారు చాలా మందే ఉన్నారు. భార్యాభర్తల్లో ఏ ఒక్కరి ఆరోగ్య పరిస్థితి మెరగ్గా లేకపోయినా, ఇద్దరి ఆహారపు అలవాట్లు మంచిగ లేకపోయినా.. సంతాన లేమి సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి.
 

infertility

అంతేకాదు స్ట్రెస్ ఎక్కువైతే కూడా సంతానలేమి సమస్యలు వస్తాయని నిపుణులు తేల్చి చెబుతున్నారు. 15 శాతం ఆడవారిలో ఈ సమస్య ఉందని అధ్యయనాలు తేల్చి చెబుతున్నాయి. అయితే లైఫ్ స్టైల్ ను మార్చుకుంటే మాత్రం ఎలాంటి సమస్యలు రావని చెబుతున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం పదండి. 


infertility

సంతానోత్పత్తికి బరువుకు సంబంధం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. బరువు తక్కువున్నా, ఎక్కువున్నా ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. దీనివల్ల హార్మోన్లు బ్యాలెన్స్ గా ఉండవు. దీంతో గర్భం దాల్చడం కష్టంగా మారుతుంది. 

overweight

ఓవర్ వెయిట్ వల్ల నెలసరిపై చెడు ప్రభావం పడుతుంది. పీరియడ్స్ టైం ప్రకారం కాకపోవచ్చు. ఈ కారణంగా మీకు పిల్లలు పుట్టే అవకాశం తగ్గుతుంది. ఇలా కాకూడదంటే.. వెయిట్ ను కంట్రోల్ లో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. కాబట్టి ఓవర్ వెయిట్ ఉండే వారు బరువు తగ్గడానికి ప్రయత్నంచండి. బరువు తక్కువగా ఉండేవారు వారి వయసుకు తగ్గ బరువు పెరగడం మంచిది. ఇందుకోసం బలమైన, పోషకాహారం తీసుకోండి. 

ఆల్కహాల్, స్మోకింగ్ కు దూరంగా ఉంటేనే మంచిది.. స్మోకింగ్, డ్రింకింగ్ ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. స్మోకింగ్ చేయడం వల్ల లంగ్స్ దెబ్బతింటాయనే అందరికీ తెలుసు. కానీ స్మోకింగ్ తో సంతానోత్పత్తి సమస్యలు తెలెత్తుతాయి. 

ఇకపోతే ఆల్కహాల్ వల్ల శరీరంలోని ప్రతిపార్ట్ పై ఎఫెక్ట్ పై పడుతుంది. అందుకే దీనికి దూరంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తుంటారు. ఎక్కువగా తాగడం వల్ల సంతానం కలిగే అవకాశాలు తగ్గుతాయి. ఎందుకంటే దీనివల్ల శుక్రకణాల సంఖ్య తగ్గుతుంది. 

ఐరన్ : శరీరంలో ఐరన్ లోపిస్తే ఎనీమియా బారిన పడతారు. ఎనీమియా వల్ల సంతానం కలగదు. కాబట్టి పిల్లల కోసం ప్లాన్స్ వేసుకునే ముందు మీ శరీరంలో ఐరన్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవడం తప్పనిసరి. 

ఒత్తిడి వద్దు.. ప్రస్తుత కాలంలో ఎక్కువ మంది ఎదుర్కొంటున సమస్య ఒత్తిడి. ప్రతి ఒక్కరిలో ఈ ప్రాబ్లమ్ కామన్ గా కనిపిస్తూ ఉంటుంది. దీనివల్ల ఎన్నో అనర్థాలు కలుగుతాయి. ఒత్తిడికి గురైతే రీప్రొడక్టివ్ హార్మోన్స్ పై చెడు ప్రభావం పడుతుంది. దీంతో మీ  Reproductive capacity దెబ్బతిని పిల్లలు పుట్టే అవకాశం తగ్గుతుంది. కాబట్టి తల్లులు కావాలంటే ఒత్తిడికి దూరంగా ఉండండి. 

Latest Videos

click me!