చద్దన్నాన్ని చూస్తే మొహం చాటేస్తున్నారా.. దీనివల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా..?

Published : Mar 25, 2022, 10:39 AM IST

Chaddannam Health Benefits: ఏ రకంగా చూసుకున్నా.. చద్దన్నంతో వచ్చే లాభాలు ఉడుకు అన్నంతో కూడా రావని మన తాతలకు, ముత్తాతలకు బాగా తెలుసు.. అందుకే వారు చద్దన్నాన్నే ఎక్కువగా తినెటోళ్లు..   

PREV
19
చద్దన్నాన్ని చూస్తే మొహం చాటేస్తున్నారా.. దీనివల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా..?

Chaddannam Health Benefits: చద్దన్నాన్ని ఒకప్పుడు పేదోళ్ల ఆహారంగానే భావించేటోళ్లు.  రాను రాను సేంద్రీయ వ్యవసాయం ఎలా అయితే వెలుగులోకొచ్చిందో.. అలాగే చద్దన్నం ప్రయోజనాలు కూడా జనాలకు తెలిసొచ్చింది. అందుకే ఇప్పుడు జనాలంతా చద్దన్నాన్నే ఎక్కువుగా తింటున్నారు. 
29

తెలుగు రాష్ట్రాల్లో చద్దన్నం తినేవాళ్ల సంఖ్య తక్కువగానే ఉన్నా.. ఒడిశాను ఆనుకుని ఉండే ఉత్తరాంధ్ర జిల్లా వాసులు మాత్రం ఎక్కువగా తింటుంటారు. రాత్రి వండిన అన్నంలో కొన్ని నీళ్లు పోసి ఏడెనిమిది గంటలు నానబెడతారు. అది ఉదయం కల్లా పులుస్తుంది. అంతేకాదు ఆ అన్నానికి మంచి రుచి కూడా వస్తుంది. ఈ అన్నాన్ని పెరుగు, పచ్చళ్లను కలుపుకొని తింటుంటారు. 

39

మరికొంతమందైతే.. ఈ చద్దన్నంలో ఉల్లిపాయ, ఉప్పు, మిరపకాయలను నంజుకుని లాగిస్తుంటారు. స్తోమతను బట్టి ఈ చద్దిబువ్వలో అవకాయ, ఎండు చాపలు, అప్పడాలు, వడియాలు వంటివి నంజుకుని తింటూ ఉంటారు. ఈ చద్దన్నం అలవాటు ఈ మధ్య కాలంలోది కాదు. మన తాతలు, ముత్తాతల కాలం నుంచి కొనసాగుతూ వస్తోంది. 
 

49

ఇప్పుడు ఈ చద్దన్నం తినడం అంటే నామోషీగా అనిపించో లేకపోతే చల్లగా ఉందనో ఎవరూ తినడానికి ఇంట్రెస్ట్ చూపడం లేదు. కానీ చద్దన్నం తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. చద్దన్నం తినడం వల్ల పేగు ఆరోగ్యం బావుంటుంది. అంతేకాదు ఈ చద్దన్నం వల్ల పేగులకు మంచి చేసే బ్యాక్టీరియా చేరుతుంది. 
 

59

ఎండాకాలం శరీరాన్ని చల్లగా ఉంచడానికి చద్దన్నం ఎంతో సహాయపడుతుంది. అంతేకాదు దీనితో ఇమ్యూనిటీ వపర్ కూడా పెరుగుతుందని పలు అధ్యయనాలు కూడా స్పష్టం చేశాయి. 

69

చద్దన్నం తినడం వల్ల ఆల్జీమర్స్, మతిమరుపు వంటి సమస్యలు ఇట్టే తగ్గుముఖం పడతాయి. అంతేకాదు చద్దన్నాన్ని తినడం వల్ల జీర్ణక్రియలో రిలీజయ్యే చెడు రసాయనలు తొలగిపోతాయి. 

79

మీకు తెలుసా.. మామూలు అన్నం కంటే పులియబెట్టిన బువ్వలోనే 21 శాతం ఐరన్ ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు దీన్ని తినడం వల్ల ఐరన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం శాతాలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. 
 

89

అంతేకాదు చద్ది అన్నాన్ని రెగ్యులర్ గా తినేవారు అలసటకు గురికారట. రక్తహీనత సమస్యను ఎదుర్కొంటున్నవారు రెగ్యులర్ గా ఈ చద్దన్నాన్ని తింటే.. మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఎముకలు , దంతాలు బలంగా ఉండాలంటే ఈ చద్దన్నాన్ని తినాలని నిపుణులు చెబుతున్నారు. 

99

అంతేకాదు కరోనా నుంచి మనల్ని రక్షించడానికి చద్దన్నం ఎంతో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇన్ని ప్రయోజనాలున్న చద్దన్నాన్ని చులకనగా చూడకుండా.. పుష్టిగా తినండి.  
 

click me!

Recommended Stories