Chanakya Niti: బంగారం కంటే కూడా డైమండ్ చాలా విలువైనది. కానీ, ఈ భూమి మీద డైమండ్ కంటే కూడా విలువైనవి కూడా ఉన్నాయని చాణక్యుడు అంటున్నాడు. అవి ఏంటి? వాటిని ఎప్పుడూ ఎందుకు దుర్వినియోగం చేయకూడదు..?
ఆచార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మానవాళికి సంబంధించిన చాలా విషయాలను తన చాణక్య నీతిలో వివరించారు. ఆయన ప్రకారం.. చాలా మంది అన్నింటి కన్నా కూడా.. డైమండ్ విలువైనదిగా పరిగణిస్తారు. కానీ, వజ్రం కంటే కూడా... విలువైనవి మూడు ఉన్నాయని.. కొన్నిసార్లు.. కోట్ల రూపాయలు చేతిలో ఉన్నా కూడా వాటిని కొనలేం. అవేంటో ఇప్పుడు చూద్దాం....
చాణక్యుడు ఏమన్నారంటే...
"పృథివ్యాం త్రీణి రత్నాని జలమన్నం సుభాషితమ్ |
మూఢైః పాషాణఖండేషు రత్నసంజ్ఞా విధీయతే ||"
ఈ భూమిపై నిజమైన రత్నాలు మూడే మూడు. అవి నీరు, ఆహారం, మధురమైన మాటలు (సుభాషితం) అని చాణక్యుడి భావన. అజ్ఞానులు మాత్రమే మెరిసే రాతి ముక్కలను రత్నాలుగా భావిస్తారని ఆయన స్పష్టం చేశారు.
23
ఈ మూడింటినీ ఎందుకు ఎప్పుడూ దుర్వినియోగం చేయకూడదు..?
1. నీరు (జలం - ప్రణవ స్వరూపం) భూమిపై జీవం నిలబడటానికి నీరే ప్రధాన ఆధారం. ఒక్క చుక్క నీరు కూడా అందుబాటులో లేని రోజు వస్తే, ఈ ప్రపంచంలో జీవుల ఉనికి అంతమైపోతుంది. అందుకే నీటిని వజ్రం కంటే అమూల్యమైనదిగా భావించి, ప్రతి బొట్టునూ జాగ్రత్తగా పొదుపు చేయాలి. నీటిని ఆదా చేయడం అంటే మన తర్వాతి తరం భవిష్యత్తును సురక్షితం చేయడమే.
2. ఆహారం (అన్నం - ప్రాణదాత) శరీరానికి పోషణనిచ్చే అన్నం లేకపోతే ఏ ప్రాణి జీవించలేదు. ప్రపంచంలో ప్రతిరోజూ ఆకలితో అలమటించే వారు ఎందరో ఉన్నారు. కాబట్టి ఆహారం పుష్కలంగా ఉందని వృధా చేయడం క్షమించరాని నేరం. మీ వద్ద అదనంగా ఆహారం ఉంటే ఆకలితో ఉన్నవారికి దానం చేయండి. చాణక్యుడి దృష్టిలో అన్నదానమే ప్రపంచంలో అత్యంత శ్రేష్ఠమైన దానం.
33
3. మధురమైన మాటలు (సుభాషితం - మౌల్యమైన ఆభరణం)
మానవ సంబంధాలను నిలిపేది మధుర సంభాషణే. ప్రశాంతమైన ఆలోచనలతో , కేవలం మంచి మాత్రమే మాట్లాడే వ్యక్తి జీవితంలో ఎంతటి కఠినమైన సమస్యలనైనా సులువుగా పరిష్కరించుకోగలడు. కోపంతో నోరు జారే అనవసరమైన మాటలు బంధాలను నాశనం చేస్తాయి. కాబట్టి మాటలను చాలా వివేకంతో, మితంగా ఉపయోగించాలి.
వజ్రాలు కేవలం అలంకారానికి మాత్రమే పనికొస్తాయి. కానీ నీరు, ఆహారం, మధురమైన మాటలు మన జీవితాన్ని నిలబెడతాయి. అందుకే వీటిని అతిగా వాడకుండా, దుర్వినియోగం చేయకుండా గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత!