Monkeypox: మంకీపాక్స్ గాలి ద్వారా వ్యాపిస్తుందా..?

Published : Jun 09, 2022, 09:42 AM ISTUpdated : Jun 09, 2022, 09:44 AM IST

Monkeypox: ఒకటిపోతే ఇంకోటన్నట్టు.. ప్రస్తుతం కరోనా మహమ్మారి పూర్తిగా వదిలిపోకముందే.. ఇప్పుడు మంకీపాక్స్ కూడా ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇక దీనిబారిన పడుకుండా ఉండేందుకే ప్రపంచ ఆరోగ్య  సంస్థ, ఆరోగ్య నిపుణులు ఎప్పటికప్పుడు జాగ్రత్తలను, సూచనలను ఇస్తూనే ఉన్నారు.    

PREV
18
Monkeypox: మంకీపాక్స్ గాలి ద్వారా వ్యాపిస్తుందా..?

కోవిడ్ తర్వాత దేశాన్ని మంకీపాక్స్ (Monkeypox)వ్యాధి భయపెడుతోంది. ఈ వైరస్ ను గుర్తించబడిన దేశాల్లో 800 కేసులకు చేరనున్నాయి. యూకేలో 300కు పైగా కేసులు నమోదైనట్లు.. 30కి పైగా దేశాల్లో ఇది వ్యాపించిందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ వారం నుంచి మంకీపాక్స్ ను అంటువ్యాధిగా ప్రకటిస్తామని యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ (UK Health Security Agency) తెలిపింది.
 

28

"మంకీపాక్స్ కేసుల వేగవంతమైన వ్యాప్తి, చికిత్స మరియు నియంత్రణకు సహాయపడుతుంది.", అని  యుకెహెచ్ఎస్ఎ (UKHSA)లో పరిశోధకుడు వెండీ షెపర్డ్ బ్రిటిష్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ లె చెప్పారు.

38

2018 లో యుకెలో మంకీపాక్స్ వైరస్ మొదటిసారి నివేదించబడింది. కొన్ని కేసులు మాత్రమే నిర్ధారణ అయినట్లు బీబీసీ తెలిపింది. జ్వరం, కండరాల నొప్పి, తలనొప్పి, వణుకు మరియు అలసట ఈ వ్యాధి యొక్క ప్రధాన లక్షణాలు.

48

ఈ మంకీపాక్స్ సోకిన వ్యక్తితో సన్నిహితంగా మెలిగిన వారు కూడా ఈ వైరస్ (Virus)బారిన పడొచ్చు. వైరస్ యొక్క వాహకాలుగా ఉండే అవకాశం ఉన్న, ఇది సోకిన జంతువులను తాకడం ద్వారా లేదా వైరస్ తో కలుషితమైన పదార్థాల ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది. మంకీపాక్స్ వైరస్ కు చికిత్స లేదని నిపుణులు చెబుతున్నారు. కానీ మశూచి వ్యాక్సినేషన్ (Smallpox Vaccination))ఈ వ్యాధిని నివారించడంలో 85 శాతం ప్రభావవంతంగా ఉందని నిరూపించబడింది.

58
Monkeypox

మంకీపాక్స్ గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందా?

మంకీపాక్స్ అనేది కోవిడ్ -19 (covid-19) మాదిరిగానే గాలి (Air)ద్వారా వ్యాపించే వ్యాధి అని నిపుణులు చెబుతున్నట్టు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. 2017లో నైజీరియా జైలులో చెలరేగిన మంకీపాక్స్ వైరస్ సోకిన వ్యక్తితో సంబంధం లేని ఖైదీలు, ఆరోగ్య కార్యకర్తలు కరోనా బారిన పడ్డారని నిపుణులు ఎన్వైటీ (NYT)కి తెలిపారు.
 

68

మాంకీపాక్స్ ప్రమాదాన్ని నివారించడానికి మాస్క్ (Mask) ధరించడంపై యుఎస్ సెంటర్స్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ (US Centers for Disease Control) జరిపిన దర్యాప్తులో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మంకీపాక్స్ వైరస్ కొన్నిసార్లు సార్స్-కోవ్-2 వంటి ఏరోసోల్స్ (Aerosols)ద్వారా వ్యాప్తి చెందుతుందని నివేదిక పేర్కొంది.
 

78

మాస్క్ ధరించడం వల్ల మంకీపాక్స్ (Monkeypox) సహా అనేక వ్యాధుల నుండి రక్షించడానికి సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. ఈ వైరస్ గాలి ద్వారా కొద్ది దూరం వరకు వ్యాప్తి చెందుతుంది. న్యూయార్క్ టైమ్స్ ప్రకారం.. మొత్తం ప్రసారం ( transmission)లో గాలి ద్వారా వ్యాప్తి చెందడం అనేది ఒక చిన్న కారకం మాత్రమే.

88

ఈ వ్యాధి సోకిన రోగి లేదా జంతువుతో సన్నిహితంగా ఉన్న వ్యక్తులలో ఈ వ్యాధిని గుర్తించినట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. "మశూచి సాధారణంగా బొబ్బల ద్వారా వ్యాప్తి చెందుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ ఏ కారణం చేతనైనా.. ఇది ఎప్పటికప్పుడు చిన్న కణ ఏరోసోల్స్ ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది" అని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ( National Institute of Allergy and Infectious Diseases)లో వైరాలజిస్ట్ మార్క్ చాల్బర్గ్ చెప్పారు.

Read more Photos on
click me!

Recommended Stories