Monkey: కోతులతో ఇబ్బంది ప‌డుతున్నారా.? ఇలా చేస్తే ఇక‌పై మీ ఇంటికి ర‌మ్మ‌న్నా రావు..

Published : Dec 19, 2025, 12:41 PM IST

Monkey: అటవీ ప్రాంతం తగ్గడం, పట్టణీకరణ పెరగడం కారణం ఏదైనా కోతులు గ్రామాల్లోకి రావడం ఇటీవల ఎక్కువైంది. గుంపులుగా వస్తున్న కోతులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అయితే కొన్ని నేచురల్ చిట్కాలతో ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు. 

PREV
14
కోతుల బెడద ఎందుకు పెరుగుతోంది?

గ్రామాలు మాత్రమే కాదు, పట్టణాల్లో కూడా కోతుల సమస్య రోజు రోజుకీ పెరుగుతోంది. చెట్లు తగ్గిపోవడం, అడవుల నుంచి నివాస ప్రాంతాల వైపు కోతులు రావడం ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు. ఇంటి పైకప్పులు, బాల్కనీలు, కిచెన్లను టార్గెట్ చేస్తూ కోతులు దాడులు చేస్తున్నాయి. ఒకసారి ఆహారం దొరికితే అదే ఇంటికి మళ్లీ మళ్లీ రావడం కోతుల స్వభావం.

24
కోతులు అస్సలు ఇష్టపడని వాసనలు

కోతులు ఘాటైన వాసనల్ని తట్టుకోలేవు. ముఖ్యంగా నిమ్మ తొక్కలు, వెనిగర్ వాసన, వెల్లుల్లి వాసన వాటిని దూరంగా ఉంచుతుంది. బాల్కనీ, కిటికీల దగ్గర నిమ్మ తొక్కలు పెట్టడం లేదా నీటితో కలిపిన వెనిగర్‌ను స్ప్రే చేయడం వల్ల ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు. పెప్ప‌ర్‌మెంట్ ఆయిల్‌ను నీటిలో కలిపి పిచికారీ చేయడం కూడా మంచి ఫలితం ఇస్తుంది. కర్పూరం వాసన కూడా కోతులకు అసహ్యంగా ఉంటుంది.

34
ఇలా కూడా త‌రిమికొట్టొచ్చు

కోతులు పెద్ద పెద్ద శ‌బ్ధాల‌కు భ‌య‌ప‌డ‌తాయి. టిన్ డబ్బాలు, లోహ పాత్రలు కొట్టడం, క్రాక‌ర్స్‌ సౌండ్స్ వాటికి పారిపోతాయి. మెరిసే రిబ్బన్లు, గాలిలో కదిలే స్ట్రిప్స్ కోతులను గందరగోళానికి గురిచేస్తాయి. ఇక పాములు క‌నిపించే కోతులు శ‌త్రువులుగా భావిస్తాయి. కాబ‌ట్టి ర‌బ్బరు పాము బొమ్మ‌ల‌ను బాల్క‌నీ గోడ‌ల‌పై ఉంచితే కోతులు అటు వైపు రాకుండా ఉంటాయి.

44
ఈ జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి

కోతుల‌కు స‌ర‌దా కోసం కూడా ఆహారం ఇవ్వ‌కూడదు. కొంద‌రు అర‌టి పండ్లు లాంటివి పెడుతుంటారు. అయితే ఇలా ఒక్క‌సారి చేసినా అవి వ‌స్తూనే ఉంటాయి. బాల్క‌నీల్లో, ఇంటి ముద్దు ఆహార ప‌దార్థాలు లేకుండా చూసుకోవాలి. అలాగే డ‌స్బిన్స్ కూడా కోతుల‌కు క‌నిపించ‌కుండా పెట్టాలి. ఇక బాల్క‌నీల‌కు గ్రిల్స్ లాంటివి ఏర్పాటు చేసుకున్నా కోతుల బెడ‌ద నుంచి త‌ప్పించుకోవ‌చ్చు. ఇటీవ‌ల మార్కెట్లో ఇన్విస‌బుల్ గ్రిల్స్ కూడా వ‌స్తున్నాయి. ఇవి మీ బాల్క‌నీ అందాన్ని చెడ‌గొట్ట‌కుండా ర‌క్ష‌ణ ఇస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories