ఆరోగ్యం కోసం రోజుకు రెండు గంటలే మొబైల్ వాడకం, ఇక దేశంలో ఇదే రూల్

Published : Aug 29, 2025, 11:05 AM IST

మొబైల్ వాడకం వల్ల ఎన్నో రోగాలు వస్తున్నాయి. అందుకే ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్ తక్కువగా వాడాలి. తమ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి జపాన్ లోని ఓ సిటీ ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. రెండు గంటలకు మించి ఫోన్ వాడకూడదు.

PREV
14
రెండు గంటలకు మించి వాడకూడదు

ఆధునిక యుగంలో స్మార్ట్ ఫోన్ చేతిలో లేకపోతే పని జరగదు. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌లు ప్రపంచాన్నే శాసిస్తున్నాయి. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇప్పుడు ఫోన్‌లకు బానిసలైపోతున్నారు.   కమ్యూనికేషన్, వినోదం, చదువు, ఉద్యోగం ఇలా అన్నింటికీ స్మార్ట్‌ఫోన్‌లు అవసరమయ్యాయి. కానీ ఆ ఫోన్ ను ఎక్కువగా వాడటం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. 

24
ఆ ఊరిలో వాడకంపై నిషేధం

మొబైల్ వల్ల యువత మాత్రమే కాదు పిల్లలు కూడా ప్రభావితమవుతున్నారు. వారి చదువు దెబ్బతింటోంది. జపాన్‌ దేశంలో కూడా అందరూ ఫోన్‌లకు బానిసలయ్యారు. ఈ విషయాన్ని యోనెజావా నగరంలో  కొత్త రూల్ అమల్లోకి వచ్చింది. ఆ నగర అధికారులు కేవలం రోజుకి 2 గంటలు మాత్రమే ఫోన్ వాడాలని రూల్ పెట్టింది. దీంతో ఆ నగరంలోని వారు అదే నియమాన్ని పాటిస్తున్నారు.

34
చట్టపరమైన నిషేధం కాదు

రోజుకి 2 గంటలు మాత్రమే ఫోన్ వాడాలని యోనెజావా మేయర్ నియమాలు పెట్టారు.  అయితే ఇది చట్టం కాదు, స్వచ్ఛందంగా పాటించాల్సిన రూల్. దీన్ని అమలు చేయడానికి ప్రజలు, స్కూళ్లు, తల్లిదండ్రులు సహకరించాలని నగరం కోరింది. దీన్ని పాటించే వారి సంఖ్య పెరిగిపోయింది.

44
స్మార్ట్‌ఫోన్‌తో ఆరోగ్య సమస్యలు

గంటలు గంటలు ఫోన్ వాడితే మానసిక, శారీరక సమస్యలు వస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. మొబైల్ ఫోన్ లో ఆన్‌లైన్ గేమ్స్, వీడియోలు పిల్లల చదువును తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉంది. ఫోన్ అధికంగా వాడితే కంటి సమస్యలు, ఒళ్ళు నొప్పులు, నిద్రలేమి వంటివి కూడా వస్తాయి. అందుకే జపాన్ లోని ఈ నగర మేయర్ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.

Read more Photos on
click me!

Recommended Stories