Hair Fall Solution: నూనె పెట్టుకుంటున్నా జుట్టు ఊడిపోతోందా? కారణం ఇదే కావొచ్చు..

Published : Mar 13, 2022, 01:39 PM IST

Hair Fall Solution: చాలా మంది ఆడవారు జుట్టుకు తరచుగా నూనె పెట్టుకుంటూనే ఉంటారు. అయినా వారి జుట్టు రాలిపోతూనే ఉంటుంది. నూనె అప్లై చేసే పద్దతి సరిగ్గా లేనందువల్లే హెయిర్ రాలిపోతూ ఉంటుంది. ఇందుకు  మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..

PREV
17
Hair Fall Solution: నూనె పెట్టుకుంటున్నా జుట్టు ఊడిపోతోందా? కారణం ఇదే కావొచ్చు..

Hair Fall Solution: మారుతున్న కాలానికి అనుగుణంగా మనుషుల అలవాట్లు కూడా పూర్తిగా మాతున్నాయి. ఒకప్పుడు స్నానం చేసిన రోజు తప్పా మిగతా రోజులల్లో తలకు పక్కాగా నూనెను రాసుకునే వారు. ఇప్పుడు ఇలా అస్సలు లేదు. స్నానం చేసే రెండు గంటల ముందు పెడితే పెడుతున్నారు లేదంటే అలాగే స్నానం చేస్తున్నారు. 

27
hair fall

ప్రస్తుత కాలంలో జుట్టుకు నూనె రాయడం పూర్తిగా మర్చిపోయారు. దీనివల్ల జుట్టు పొడిబారుతుంది. తద్వారా చుండ్రు సమస్య తలెత్తుతుంది. ఇక ఈ  డాండ్రఫ్ తో తలలో దురద సమస్య వస్తుంది. ఈ సమ్యలకు మూల కారణంగా జుట్టుకు నూనె రాయకపోవడమే అంటున్నారు నిపుణులు. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టాలంటే మాత్రం ఖచ్చితంగా జుట్టుకు నూనెను అప్లై చేయాలని నిపుణులు చెబుతున్నారు. 

37
hair fall

నూనె పెట్టుకున్నా.. జుట్టు విపరీతంగా ఊడిపోతుందంటూ చాలా మంది వాపోతుంటారు. ఇందుకు కారణాలు లేకపోదు. అవేంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.. 

47
hair fall

జుట్టుకు నూనెను సరైన పద్దతిలో పెట్టకపోతే కూడా హెయిర్ ఫాల్ సమస్య వస్తుంది. ముఖ్యంగా జుట్టుకు నూనెను పెట్టిన తర్వాత ఒక రెండు నిమిషాలు చిన్నగా మర్దన చేయాలి. ఈ మసాజ్ ఫాస్ట్ గా అస్సలు చేయకూడదు. పొరపాటున ఇలాచేస్తే మాత్రం జుట్టు ఊడిపోయే అవకాశం ఉంది. 

57

జుట్టు కు నూనెను అప్లై చేసిన వెంటనే కొందరు పోనీటైల్ వేసుకోవడమో.. గట్టిగ ముడివేయడమో.. లేకపోతే తలస్నానం చేయడమో చేస్తుంటారు. దీనివల్ల కూడా హెయిర్ ఫాల్ సమస్య వస్తుంది. 

67

జుట్టుకు హెయిర్ ఆయిల్ ను అతిగా కూడా పెట్టకూడదు. ఇలా పెడితే  వెంట్రుకలు పెరిగే రంధ్రాలు పూర్తిగా మూసుకుపోతాయి. దాంతో కూడా జుట్టు రాలుతుంది. 

77

వేడిగా ఉండే నూనెను తలకు అప్లై చేయడం, వేడినీళ్లతో తలస్నానం చేయడం వల్ల కూడా జుట్టు విపరీతంగా రాలుతుంది. 

click me!

Recommended Stories