Skin Care: మండే ఎండలకు అబ్బాయిలు తమ స్కిన్ ఎలా కాపాడుకోవాలి?
ఎండలకు స్త్రీల చర్మం మాత్రమే కాదు.. పురుషుల చర్మం కూడా దెబ్బతింటుంది. మరి, వారి చర్మ సంరక్షణ కోసం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం..
ఎండలకు స్త్రీల చర్మం మాత్రమే కాదు.. పురుషుల చర్మం కూడా దెబ్బతింటుంది. మరి, వారి చర్మ సంరక్షణ కోసం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం..
Best Men's Skin Care Tips For Summer : సాధారణంగా చర్మ సంరక్షణ అందం అంటే అమ్మాయిలకే అనుకుంటారు. కానీ అబ్బాయిలు కూడా చర్మాన్ని కాపాడుకోవాలి. ముఖ్యంగా వేసవిలో మగవాళ్లు చర్మాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. వేడి నుంచి చర్మాన్ని ఎలా కాపాడుకోవాలో ఈ పోస్ట్ లో తెలుసుకుందాం.
వేసవి కాలం మొదలైంది. ఈ సీజన్లో చెమట ఎక్కువగా పడుతుంది. కాబట్టి ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. మీ చర్మం రకాన్ని బట్టి ఫేస్ వాష్ ఉపయోగించి శుభ్రం చేయండి. రోజుకి రెండుసార్లు ఫేస్ వాష్ తో ముఖం కడగాలి. గోరువెచ్చని నీటితో అప్పుడప్పుడు కడగండి. దీనివల్ల మురికి, జిడ్డు పోయి చర్మం శుభ్రంగా ఉంటుంది.
మాయిశ్చరైజర్
వేడికి చర్మం తొందరగా పొడిబారుతుంది. కాబట్టి చర్మాన్ని ఎప్పుడూ తేమగా ఉంచుకోవడం ముఖ్యం. దీనికోసం మాయిశ్చరైజర్ వాడండి. వాటర్ లా ఉండే మాయిశ్చరైజర్ ఇంకా మంచిది.
ప్రతి ఒక్క మగాడు సన్ స్క్రీన్ వాడాలి. ముఖ్యంగా ఎండలో సన్ స్క్రీన్ లేకుండా బయటికి వెళ్లకూడదు. పొడి చర్మం ఉంటే పేస్ట్ లాంటి సన్ స్క్రీన్ వాడొచ్చు. జిడ్డు చర్మం అయితే జెల్ పేస్ట్ లాంటిది వాడండి. సన్ స్క్రీన్ మీ చర్మాన్ని సూర్యకిరణాల నుంచి కాపాడుతుంది. మీ చర్మం రంగు మారకుండా ఉంటుంది.
ఎక్స్ఫోలియేట్
ఎక్స్ఫోలియేట్ అమ్మాయిలకే కాదు, అబ్బాయిలకు కూడా అవసరం. అబ్బాయిలు చర్మాన్ని పట్టించుకోరు. దీనివల్ల చర్మంపై చనిపోయిన కణాలు అలాగే ఉంటాయి. దీనివల్ల రక్త ప్రసరణ సరిగ్గా ఉండదు. కాబట్టి వారానికి ఒకటి లేదా రెండుసార్లు బియ్యం పిండి లేదా కాఫీ స్క్రబ్ తో స్క్రబ్ చేయండి.
రోజుకి రెండుసార్లు స్నానం చేయండి
మండే ఎండల్లో రోజుకి రెండుసార్లు స్నానం చేయడం అలవాటు చేసుకోండి. దీనివల్ల శరీరం వేడి తగ్గుతుంది. అంతేకాదు, చెమట, మురికి పోయి తాజాగా ఉంటారు.
పెదవుల సంరక్షణ
వేడికి చర్మమే కాదు పెదవులు కూడా పొడిబారుతాయి. కాబట్టి పెదవులకి లిప్ బామ్ రాయండి. లేదంటే వాస్లైన్ రాసుకోవచ్చు.
షేవింగ్..
వేసవిలో ట్రిమ్మర్, హాట్ స్క్రీన్ తో షేవ్ చేస్తే చర్మం మంటగా ఉంటుంది. బదులుగా చల్లగా ఉండే క్రీమ్స్ మార్కెట్లో దొరుకుతాయి. వాటిని వాడి షేవ్ చేసి, చల్లటి నీటితో కడగండి. చర్మం మృదువుగా ఉంటుంది.
గుర్తుంచుకోండి :
పైన చెప్పిన వాటికంటే ముఖ్యంగా వేసవిలో ఆరోగ్యకరమైన డైట్ పాటించడం ముఖ్యం. నీరు ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోండి. పోషకాలున్న ఆహారం ఎక్కువగా తినండి. నానబెట్టిన ఎండు ద్రాక్ష, దాని నీళ్లు తాగితే చర్మం ఎప్పుడూ మెరుస్తూ ఉంటుంది.