Mango Side Effects: మామిడి పండ్లను వీళ్లు మాత్రం తినకూడదు..

Published : Apr 10, 2022, 04:56 PM IST

Mango Side Effects: మామిడి పండ్లు ఆరోగ్యానికి మంచి చేసేవే అయినా.. వీటిని మధుమేములు, అలెర్జీ సమస్య ఉన్నవారు, బరువు తగ్గాలనుకునేవారు, అజీర్థి  సమస్యలు ఉన్నవారు మాత్రం అస్సలు తినకూడదు.  

PREV
19
Mango Side Effects: మామిడి పండ్లను వీళ్లు మాత్రం తినకూడదు..
mango

పండ్లలో రారాజైన మామిడి పండ్లు వేసవిలో పుష్కలంగా లభిస్తాయి. ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్, విటమన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయి. 

29
mango

ఎండాకాలంలో పుష్టిగా లభించే ఈ మామిడి పండ్లలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఈ పుష్కలంగా ఉంటాయి. అలాగే సహజ చక్కెర, ఖనిజాలు కూడా అధిక మొత్తంలో ఉంటాయి. ఇక ఈ పండులో యాంటీ ఆక్సిడేటివ్, పాలీఫెనాల్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి. 

39
mango

అయితే మామిడిపండ్లు ఇతర సీజన్లలో లభించవని.. ఈ సీజన్ పోతే మళ్లీ దొరకవని అతిగా లాగిస్తే మాత్రం ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోకతప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం.. 

49

మామిడి పండ్లను మోతాదుకు మించి తింటే విరేచాల  సమస్య చుట్టుకుంటుంది. ఈ పండులో ఉండే పీచు పదార్థం, ఫైబర్ యే విరేచనాలకు కారణమవుతుంది. కాబట్టి వీటిని పరిమితికి మించి అస్సలు తినకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 

59
mango

మామిడి పండులో షుగర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. కాబట్టి ఇది డయాబెటీస్ రోగులకు మంచిది కాదు. ఇది తింటే షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరుగుతాయి.  అయినా సరే మామిడి పండ్లను తినాలనుకుంటే మాత్రం వైద్యుడిని సంప్రదించాకే తినడం బెటర్. 

69

మామిడి పండ్లను తింటే కొందరికీ అలెర్జీ అవుతుంది. కడుపు నొప్పి, ముక్కు కారడం, తుమ్ములు రావడం, శ్వాసలో ఇబ్బంది వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి అరెల్జీ సమస్య ఉన్నవారు ఈ పండ్లను తినకపోవడమే మంచిది. ఒకవేళ తినాలంటే వైద్యుల సలహాలు తీసుకోండి. 
 

79
mango

బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లకు దూరంగా ఉండటమే మంచిది. ఎందుకంటే ఈ పండులో కేలరీలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఒక్క మామిడి పండులో ఏకంగా 150 కేలరీలు ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు మామిడి పండ్లను తినాలో.. వద్దో.. తేల్చుకోవాల్సిందే. 

89

మోతాదుకు మించి మామిడి పండ్లను ఎక్కువగా తింటే అజీర్థి సమస్యను ఫేస్ చేయాల్సి ఉంటుంది. అదికూడా పచ్చి మామిడి కాయను తిన్నప్పుడు . కాబట్టి పచ్చి మామిడికాయను ఎక్కువగా తినకండి. 
 

99
mango

ఇకపోతే పండిన మామిడి పండులో ఉండే కార్బైడ్ అనే రసాయనం మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. కాబట్టి వీటిని మోతాదులోనే తినండి. 

click me!

Recommended Stories