Male Infertility: పెళ్లైన మగవారు ఈ అలవాటును మానుకోకపోతే తండ్రి కావడం కష్టమే అంటున్న శాస్త్రవేత్తలు..

Published : Apr 26, 2022, 10:52 AM IST

Male Infertility: పెళ్లైన ప్రతి పురుషుడూ తండ్రి కావాలని కోరుకుంటాడు. కానీ పురుషుల్లో ఈ అలవాట్లు ఉంటే మాత్రం తండ్రి కావడం కల మాత్రమే అంటున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే..?   

PREV
19
Male Infertility: పెళ్లైన మగవారు ఈ అలవాటును మానుకోకపోతే తండ్రి కావడం కష్టమే అంటున్న శాస్త్రవేత్తలు..

Male Infertility: వివాహం తర్వాత ప్రతి జంట తల్లిదండ్రులు కావాలని ఆశపడుతూ ఉంటారు. కానీ పురుషుల్లో కొన్ని అలవాట్లు పిల్లలు పుట్టకుండా చేస్తాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మొబైల్ ఫోన్, ల్యాప్ టాప్ లను ఎవరైతే ఎక్కువగా వినియోగిస్తారో వారు తండ్రి కావడం కష్టమే అంటున్నారు.

29

ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. మెజారీటీ జనాలకు ఇది అత్యవసర లేదా నిత్యవసర వస్తువుగా మారింది. ఇది లేకుండా క్షణ కాలం కూడా ఉండలేని వారు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా అర్థరాత్రి వరకు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ, వీడియోలను చూసేవారు చాలా మందే ఉన్నారు. 

39

అర్థరాత్రి వరకు ఫోన్ లేదా ల్యాప్ టాప్ ను చూడటం వల్ల కలిగే నష్టాలు.. అర్థరాత్రి వరకు ఫోన్ లేదా ల్యాప్ టాప్ ఉపయోగించే అలవాటు మీకుందా..? అయితే దాన్ని వెంటనే విడిచిపెట్టాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. వాస్తవానికి అర్థరాత్రి వరకు ఫోన్లను, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను ఉపయోగించడం వల్ల పురుషుల ఆరోగ్యంపై దారుణమైన ప్రభావం పడుతుందని ఒక అధ్యయనంలో వెల్లడైంది. 

49

పరిశోధనలో షాకింగ్ విషయాలు వెల్లడి..  The Virtual Sleep Magazine of the United States లో ఒక నివేదిక ప్రకారం.. ఫోన్ లేదా ల్యాప్ టాప్ నుంచి వెలువడే బ్లూ లైట్ పురుషుల స్పెర్మ్ కౌంట్ పై ప్రతికూల ప్రభావం చూపుతుందట. అలాగే ఇది స్పెర్మ్ నాణ్యతను కూడా దెబ్బతీస్తుందట.  ఇది పురుషుల వంధ్యత్వంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. 
 

59

ఈ అధ్యయనంలో శాస్త్రవేత్తలు 116 మంది పురుషుల వీర్య నమూనాలను తీసుకున్నారు. ఈ పురుషులందరూ 21 నుంచి 59 మధ్య వయసున్న వారు. వీళ్లంతా సంతానోత్పత్తి సమస్యలను ఎదుర్కొంటున్నారు. 
 

69

ఈ పరిశోధన ద్వారా పరిశోధకులు పలు షాకింగ్ విషయాలను వెళ్లడించారు. ముఖ్యంగా సాయంత్రం నుంచి రాత్రి సమయంలో ఫోన్ లేదా ల్యాప్ టాప్ నుంచి వచ్చే బ్లూ లైట్ కు స్పెర్మ్ నాణ్యతకు మధ్య సంబంధం ఉందని తేల్చి చెప్పారు. ఈ అధ్యయనం ప్రకారం.. ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ పరికరాలు సంతానోత్పత్తిపై చెడు ప్రభావాన్ని చూపిస్తాయి. 

79

అర్థరాత్రి ఫోన్ ఉపయోగించకపోవడం వల్ల కలిగే ప్రయోజనాలు.. ఈ అధ్యయనం ప్రకారం.. అర్థరాత్రి వరకు ఫోన్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను ఉపయోగించే పురుషుల్లో వంధ్యత్వ రేటు పెరుగుతుంది. అదే సమయానికి నిద్రపోతూ తక్కువ సేపు ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను ఉపయోగించే పురుషుల్లో స్పెర్మ్ నాణ్యత, కౌంట్ బాగుంటుందని తేలింది. 
 

89
sperm

అర్థరాత్రి ఫోన్ ఉపయోగించకపోవడం వల్ల కలిగే ప్రయోజనాలు.. ఈ అధ్యయనం ప్రకారం.. అర్థరాత్రి వరకు ఫోన్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను ఉపయోగించే పురుషుల్లో వంధ్యత్వ రేటు పెరుగుతుంది. అదే సమయానికి నిద్రపోతూ తక్కువ సేపు ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను ఉపయోగించే పురుషుల్లో స్పెర్మ్ నాణ్యత, కౌంట్ బాగుంటుందని తేలింది. 

99
Infertility

భారతదేశంలో ఎంతమంది పురుషులు వంధ్యత్వంతో ఇబ్బందిపడుతున్నారు.. ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ డీఎన్ ఏను దెబ్బతీస్తుందట.  అలాగే ఆ కణాలు కోలుకునే సామర్థ్యం కూడా తగ్గుతుందని ఈ అధ్యయనం వెల్లడిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. మన దేశంలో 23 శాతం పురుషులు మేల్ వంధ్యత్వంతో బాధపడుతున్నారట. 

click me!

Recommended Stories