ఒక్క పెన్నుతో మీ కంటి చూపును మెరుగుపరుచుకోవచ్చు.. అదెలా అంటే..?

Published : Apr 26, 2022, 09:48 AM IST

Eyesight: మీ ఇంట్లో ఉండే పాత పెన్నుతో మీ కంటి చూపును మెరుగుపరుచుకోవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీనితో పాటుగా మంచి ఆహారం, వ్యాయామాలను చేయడం ద్వారా కంటిచూపు మందగించే అవకాశం లేదంటున్నారు.

PREV
19
ఒక్క పెన్నుతో మీ కంటి చూపును మెరుగుపరుచుకోవచ్చు.. అదెలా అంటే..?

విపరీతమైన ఫోన్ల వాడకం, కంప్యూటర్ల ముందు గంటల తరబడి కూర్చోవడం వంటి కారణాల వల్ల ఎంతో మంది కంటి చూపు దెబ్బతింటుందనేది వాస్తవం.  అందులోనూ ఈ ఆధునిక కాలంలో చిన్న చిన్న పిల్లలకు సైతం కళ్లజోడు వస్తున్నాయి. 
 

29

ఈ పరిస్థితులు మరింత దారుణంగా తయారవ్వకముందే మనం మన కంటిచూపును మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అదే బాగువుతుందిలే అని వదిలేస్తే మొత్తానికే చూపును కోల్పోయే ప్రమాదం ఉంది. కంటిచూపు మెరుగుపడాలంటే ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడంతో పాటుగా కొన్ని వ్యాయామాలను కూడా చేయాలి. అయితే మన కంటిచూపును పెన్నుతో కూడా మెరుగుపరుచుకోవచ్చంటున్నారు నిపుణులు. మరి పెన్నుతో కంటిచూపును ఎలా మెరుగుపరుచుకోవాలో ఈ  ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం పదండి.. 

39

పెన్నును దూరంగా.. పెన్నును మీ ముక్కుకు 35 సెం.మీ. ముందు పెట్టుకోండి. పెన్ను కొనపై మీ దృష్టిని కేంద్రీకరించండి. దానిని నెమ్మదిగా మీకు దగ్గరగా తీసుకురండి.  దాన్ని చూస్తున్న సమయంలో పెన్నును అస్సలు  కదిలించకండి. అలాగే దాన్ని దూరంగా పెడుతూ.. దాన్నే చూడండి.  ఆ తర్వాత కొన్ని సెకండ్ల పాటు మీ కండ్లకు రెస్ట్ ఇవ్వండి. ఈ పద్దతిని ప్రతిరోజూ 30 సార్లు చేయండి. ఇలా చేస్తే మీ కంటిచూపు మెరుగుదలను 4 నుంచి 5 వారాల్లో మీరే గమనిస్తారు. 
 

49


పెన్ను దూరాన్ని.. ఇప్పుడు రివర్స్ చేయండి.. ముందుగా పెన్నును మీ ముక్కుకు వీలైనంత దగ్గరగా తీసుకురావడంతో స్టార్ట్ చేయండి. ఇమేజ్ సింగిల్ అయ్యేంత వరకు పెన్నును దగ్గరగా తీసుకురండి. ఆ సమయంలో మీ కళ్లపై ఒత్తిడి పడుతుంది. కానీ ఆ సమయంలో కూడా మీరు డబుల్ ఇమేజ్ ను అస్సలు చూడకూడదు. పెన్నును అటూ ఇటూ కదల్చకుండా ఒకే స్థానంలో స్థిరంగా ఉంచండి. ఆ తర్వాత కొంచెం కొంచెం దాన్ని దూరంగా జరుపుతూ చూడండి. ఆ తర్వాత కొన్ని సెకండ్ల పాటు మీ కళ్లకు విశ్రాంతినివ్వండి.  మళ్లీ పెన్ను వైపు చూడండి. అప్పుడు కూడా మీరు ఒకే ఇమేజ్ ను చూడాలి. దీన్ని  30 సెకండ్ల పాటు కొనసాగించాలి. ఈ పద్దతిని ప్రతిరోజూ 30 సార్లు చేస్తే మీ కంటిచూపు మెరుగుపడుతుంది. 
 

59

పై వ్యాయామాలతో పాటుగా ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించడం ద్వారా కూడా మీ కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి. 

69

1. తాజా పండ్లను, గింజలను, మొలకెత్తిన విత్తనాలను, గుడ్లను, ఆకుపచ్చ కూరగాయలు, చేపలు మొదలైన ఆహార పదార్థాలను తీసుకుంటే కంటి చూపు మెరుగువుతుంది. 
 

79

2. కంటి ఆరోగ్యం బాగుండాలంటే కంటినిండా నిద్ర అవసరం. పనిలో మీరు కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ స్క్రీన్ ను ఎక్కువ సేపు చూస్తున్నట్టైతే ప్రతి రోజూ కూలింగ్ ఐ ప్యాడ్ లతో మీ కళ్లకు విశ్రాంతినివ్వాలి. 

89

3. డిమ్ లైట్లలో అస్సలు చదవకూడదు. దీనివల్ల కంటిచూపు దెబ్బతినే ప్రమాదం ఉంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. స్మోకింగ్ అస్సలు చేయకూడదు. ప్రతి 6 నెలలకు ఒకసారి మీ కళ్లను పరీక్షించుకోవాలి.
 

99

4.పెన్ ఎక్సర్ సైజెస్ తో పాటుగా మరికొన్ని వ్యాయామాలను ప్రతిరోజూ చేయాలి. రెండు అరచేతులను రుద్దుతూ వాటిని వేడి చేసి కళ్లపై 5 సెకండ్ల పాటు పెడితే కండ్లు రిలాక్స్ గా ఫీలవుతాయి. అలాగే కండ్లను రెండు దిశల్లో కదిలిస్తూ.. 10 సార్లు వృత్తాలుగా తిప్పితే కళ్లు ఒత్తిడికి గురి కావు.  

click me!

Recommended Stories