Girl's Expenses: అమ్మాయిలకు ఇవంటే పిచ్చి.. వీటి కోసం ఎంత ఖర్చుచేయమన్నా చేసేస్తారు తెలుసా..?

First Published May 7, 2022, 9:44 AM IST

Girls Favorite Products: అమ్మాయిలకు షాపింగ్ అంటే మహా ఇష్టం. అందులో బట్టలు, నగలు, చెప్పులను ఇష్టారీతిలో కొంటుంటారు. నచ్చితే చాలు అవి ఎంత ధర అని చూడకుండా కొనేస్తుంటారు. 

Girls Favorite Products: నలుగురిలో అందంగా, ఆకర్షణీయంగా, హుందాగా కనిపించడానికి అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతుంటారు. ఇలా ఉండటం కోసం ఎంత ఖర్చైనా చేసేస్తుంటారు. అంతేకాదు మార్కెట్ లోకి వచ్చే కొత్త కొత్త ప్రొడక్ట్స్ ను కూడా ట్రై చేస్తుంటారు. నలుగురిలో తాము ఎవరికంటే తక్కువ కాదు అనే విధంగా కనిపించాలనే ఇలా చేస్తారు. అయితే అమ్మాయిలు వేటిని ఎక్కువగా ఇష్టపడతారో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం పదండి. 

షాపింగ్ అంటే పిచ్చి.. అబ్బాయిలు షాపింగ్ మాల్ కు వెళితే.. ఒక  నాలుగు డ్రెస్ లు చూసామా.. అందులోంచి రెండు కొన్నామా.. బయటకు వచ్చామా.. అన్నట్టు ఉంటారు. అదే అమ్మాయిలు ఇలా కాదు.. ఒకటి కాదు రెండు కాదు.. ఐదారు షాపింగ్ మాల్స్ తిరిగినా.. ఒకటి రెండు డ్రెస్ లను కూడా సెలక్ట్ చేసుకోరు. ఇంకా వీటికంటే బాగుంటాయేమోనంటూ ఎన్నో బట్టలను చూస్తుంటారు. నచ్చనివి దొరకలేదని అమ్మాయిలు అస్సలు రాజీపడరు. ముఖ్యంగా బట్టల విషయంలో. నచ్చితే ఎంత ఖర్చైనా పెట్టి కొనేస్తుంటారు. ఇక ఇందులో బట్టలంటే అమ్మాయిలకు చాలా ఇష్టం. సమయం దొరికినప్పుడల్లా.. షాపింగ్ చేయడానికి వెళుతుంటారు. 

అమ్మాయిలు ఎక్కువగా ఈ ఆరింటికే ఎక్కువగా ఖర్చుచేస్తారు.. 

1.మేకప్ ప్రొడక్ట్స్

2. లేటెస్ట్ లేడీస్ బ్యాగ్స్

3. ఖరీదైన ఆభరణాలు

4. బయట ఫుడ్ తినడం

5. బట్టలు

6. పాదరక్షలు(చెప్పులు, షూస్)

వీటిపైనే ఎందుకు ఎక్కువ ఖర్చు చేస్తారు.. ఈ రోజుల్లో యువత ఎక్కువగా సోషల్ మీడియాకు బాగా అలవాటు పడిపోయింది. అందులోనూ అమ్మాయిలు స్టైల్ స్టైల్ గా సోషల్ మీడియాలో (షేర్ చాట్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ )ఫోటోలను, వీడియాలోను పెడుతున్నారు. వీటిలో తమను తాము ఫ్యాషన్ గా చూపించడానికి ఎలాంటి అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. ఇది వారి ఫాలోవర్స్ సంఖ్యను పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇకపోతే మంచి రెస్టారెంట్లలో తినడం కూడా దీనిలో భాగమే. 

డబ్బును ఖర్చు చేయడానికి స్మార్ట్ మార్గాలు.. ఖరీదైన  బట్టలు లేదా పాదరక్షలు సరసమైన ధరలకు లభించే షాపింగ్ మాల్స్, షాప్స్ పట్టణాల్లో చాలానే ఉంటాయి. కాబట్టి అనవసరంగా డబ్బులను ఎక్కువగా ఖర్చు చేయకుకండా ఆదా చేసుకోండి. 
 

ఫ్రెండ్స్ తో కలిసి బయట రెస్టారెంట్లలో తినాలనకున్నప్పుడు బిల్లును ఒక్కరే కాకుండా తమలో తాము విభజించుకుని పే చేయడం మంచిది. ఇలా చేస్తే ఏ ఒక్క వ్యక్తిపై భారం పడదు. 
 

makeup kit

మేకప్ కోసం ఎక్కువగా ఖర్చు చేయకుండా.. మిమ్మల్ని హెవీ మేకప్ తో కాకుండా.. నేచురల్ బ్యూటీగా చూపించే మేకప్ కిట్ లను కొనండి. ఇవి మిమ్మల్ని సహజంగా కనిపించేలా చేయడంతో పాటుగా అందంగా కూడా కనిపించేలా చేస్తుంది. 

ప్రతి పండుగకు ఆన్ లైన్ షాపింగ్ పై చాలా ఆఫర్లు ఉంటాయి. మీ స్నేహితులతో కలిగి పెద్ద మొత్తంలో నచ్చిన వస్తువులను కొలుగోలు చేస్తే  మీకు మంచి తగ్గింపు లభిస్తుంది. 
 

click me!