అలాంటి ఘనత అందుకున్న ఫస్ట్ స్టార్ కిడ్ సితార..!

Published : Jul 11, 2023, 02:29 PM IST

ఆ బ్రాండ్ జ్యువెలరీ సితార ధరించిన ఫోటోలను, దానికి సంబంధించిన యాడ్ లను న్యూ యార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్ లో ప్రదర్శించడం విశేషం.

PREV
19
అలాంటి ఘనత అందుకున్న ఫస్ట్ స్టార్ కిడ్ సితార..!
sitara Mahesh babu

సినీ తారలకు క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. వారు ఎప్పుడెప్పుడు తెరపై కనిపిస్తారా అని అభిమానులు ఎదురు చూస్తూ ఉంటారు.అయితే, వారి మీద మాత్రమే కాకుండా, వారి పిల్లల పై కూడా క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. దాదాపు స్టార్స్ అందరూ తమ పిల్లలను తొందరగా బయట కనిపించకుండా ఉండేలా జాగ్రత్త పడుతూ ఉంటారు. కానీ, మహేష్ మాత్రం  తన కూతురు విషయంలో అలా కాదు,  ఇప్పటి నుంచే స్టార్ ని చేసేస్తున్నారు.

29

మహేష్ ముద్దుల కుమార్తె సితార సోషల్ మీడియాలో చాలా క్రేజ్ పెంచుకుంటోంది. ఆమె హీరోయిన్లతో సమానంగా ఫ్యాన్స్ ని సంపాదించుకున్నారు. తన పేరుకు తగినట్లే రోజు రోజుకీ షైన్ అవుతోంది.

39

తాజాగా, ఆమె మరో ఘనత కూడా సాధించింది.  ప్రముఖ బంగారు నగల తయారీ సంస్థ పిఎంజె జివెల్స్ ప్రత్యేకంగా సితార కలెక్షన్ పేరుతో ఓ స్పెషల్ బ్రాండ్ ని సృష్టించడం గమనార్హం.

49

చాలా మంది పాపులర్ హీరోయిన్లకు కూడా ఈ క్రెడిట్ దక్కలేదు. కాగా, ఆ బ్రాండ్ జ్యువెలరీ సితార ధరించిన ఫోటోలను, దానికి సంబంధించిన యాడ్ లను న్యూ యార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్ లో ప్రదర్శించడం విశేషం.

59


ఇప్పుడు ఈ ఫోటోలు నెట్టింట సైతం వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు మహేష్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. అయితే, ఇలాంటి క్రెడిట్ సాధించిన  మొట్టమొదటి స్టార్ కిడ్ గా ఆమె నిలవడం విశేషం. అత్యంత చిన్న వయసులోనే సితార ఈ ఘటన సాధించింది.

69
mahesh babu daughter sitara dance

కాగా, కూతురు సాధించిన ఘనత చూసి మహేష్ కూడా మురిసిపోయారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. తండ్రి ఆనందాన్ని చూసి సితార కూడా చాలా గర్వంగా ఫీలవ్వడం విశేషం.

79


ఇదిలా ఉండగా, సితారకు ఇప్పటికే ఇన్ స్టాగ్రామ్ లో దాదాపు 1.3 మిలియన్ ఫాలోవర్స్ ఉండటం విశేషం. కాగా, సితార తన ఇంటి దగ్గర నుంచే కూచిపూడి డ్యాన్స్ నేర్చుకుంటోంది. 2022లో శ్రీరామ నవమి రోజు ఆమె డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చింది. అది చూసి ఫ్యాన్స్ కూడా ఫిదా అయిపోయారు.

89
mahesh babu daughter sitara bill board

ఇక తన తండ్రి సర్కారు వారి పాటకు కూడా ఆమె స్టెప్స్ వేయడం విశేషం. పెన్నీ పాటకు సితార అదిరిపోయే స్టెప్స్ వేసింది. ఇవి కాకుండా, సితారకు ప్రత్యేకంగా యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. ఆధ్యా అండ్ సితార పేరిట ఉన్న ఈ యూట్యూబ్ ఛానెల్ కి 278వేల సబ్ స్క్రైబర్స్ ఉండటం విశేషం. 
 

99
mahesh babu daughter sitara

కాగా, భవిష్యత్తులో ఆమె మిస్ వరల్డ్ ఛాంపియన్ షిప్స్ లో పోటీ పడాలని అనుకుంటోందట. దానికి తగినట్లుగా ఇప్పటి నుంచే సన్నాహమౌతున్నట్లు సమాచారం.
 

click me!

Recommended Stories