కుక్కలు వెంటపడగానే చాలామంది భయంతో యాక్సిలరేటర్ రైజ్ చేసి స్పీడ్ పెంచుతారు. ఇది చాలా డేంజర్! స్పీడ్ పెంచినప్పుడు బైక్ స్కిడ్ అయి కిందపడొచ్చు లేదా ఎదురుగా వచ్చే వాహనాలను ఢీకొట్టొచ్చు. అంతేకాదు, జంతు శాస్త్రం ప్రకారం మీరు ఎంత వేగంగా వెళితే కుక్కలు మిమ్మల్ని 'వేటాడే వస్తువు' (Chasing target) అనుకుని మరింత కోపంతో వెంటపడతాయి.
గట్టిగా అరవడం, హారన్ కొట్టడం ఆపండి కుక్కలను భయపెట్టడానికి కంగారులో గట్టిగా అరవడం లేదా కంటిన్యూగా హారన్ కొట్టడం పెద్ద తప్పు. ఇలాంటి విపరీతమైన శబ్దాలు కుక్కల్లో మరింత కోపాన్ని, ఆందోళనను పెంచుతాయి. దీనివల్ల అవి భయపడి పారిపోవడానికి బదులు మరింత రెచ్చిపోయి దాడి చేయడానికి ముందుకొస్తాయి.
కాలుతో తన్నడానికి ట్రై చేయొద్దు బైక్ నడుపుతూనే కదులుతున్న బండి మీద నుంచి కాలుతో కుక్కను తన్నడానికి లేదా భయపెట్టడానికి అస్సలు ట్రై చేయొద్దు. ఇలా చేస్తే 100% బండి బ్యాలెన్స్ తప్పి కిందపడిపోతారు. కదులుతున్న బండి మీద నుంచి పడితే తీవ్ర గాయాలవుతాయి.
జంతువుల సైకాలజీ ప్రకారం, వాటి కళ్లలోకి నేరుగా చూస్తే కుక్కలు దాన్ని 'సవాల్' లేదా 'దాడికి సంకేతం'గా భావిస్తాయి. కాబట్టి మీ చూపును ఎప్పుడూ ముందున్న రోడ్డు మీదే ఉంచండి