చంద్రగ్రహణం అక్టోబర్ 28 లేక 29? కరెక్టు తేదీ ఇదే..!

lunar eclipse 2023:  భూమికి, చంద్రుడికి మధ్య సూర్యుడు రావడం వల్ల చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అయితే గ్రహణం సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదని జ్యోతిష్యులు చెబుతారు. కాగా చంద్రగ్రహణం నాడే శరద్ పూర్ణిమ కూడా ఏర్పడనుంది.

lunar eclipse 2023: 28 or 29 october when is lunar eclipse occur note date sutak time and importance rsl

సనాతన ధర్మంలో చంద్రగ్రహణానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే ఈ గ్రహణం సమయంలో భూమిపై రాహువు, కేతువుల ప్రభావం పెరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. భూమికి, చంద్రుడికి మధ్య సూర్యుడు రావడం వల్ల చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అయితే చంద్రగ్రహణం, సూర్యగ్రహణాల సమయంల్లో ఎలాంటి పెళ్లిళ్లు, ఫంక్షన్లు అంటు ఎలాంటి శుభకార్యాలను చేయరు. ఒకవేళ గ్రహణం సమయంలో శుభకార్యాలు చేస్తే  శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. 
 

lunar eclipse

అయితే ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం శరద్ పూర్ణిమ రోజునే ఏర్పడబోతోంది. ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం పూర్ణిమ తిథి అక్టోబర్ 28న ఉదయం 04:17 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 29 ఉదయం 01:53 గంటలకు ముగుస్తుంది. దీంతో చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుందనే విషయంపై జనాల్లో గందరగోళం నెలకొంది. మరి చంద్రగ్రహణ ఖచ్చితమైన సమయం , తేదీని ఇప్పుడు తెలుసుకుందాం.. 


గ్రహణం ఎప్పుడు వస్తుంది?

జ్యోతిష్యుల ప్రకారం.. ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం అక్టోబర్ 29న తెల్లవారుజామున 01:06 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై 02:22 గంటలకు ముగుస్తుంది. మొత్తంగా 1 గంట 16 నిమిషాల పాటు చంద్రగ్రహణం ఉంటుంది. ఈ గ్రహణం భారత్ సహా ఆసియాలోని పలు దేశాల్లో కనిపించనుంది. అందుకే మన దేశంలో సుతక్ కాలం చెల్లుతుంది. చంద్రగ్రహణం సమయంలో సుతక్ కాలం 09 గంటలు. అందుకే సాయంత్రం 04:06 గంటలకు సుతక్ కాలం ప్రారంభమవుతుంది.
 

సుతక్ కాలం

చంద్రగ్రహణం సమయంలో 09 గంటల సుతక్ కాలం ఉంటుంది. అందుకే సుతక్ కాలం సాయంత్రం 04:06 గంటలకు ప్రారంభమవుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే  02.22 గంటలకు సుతక్ కాలం ముగుస్తుంది. చిన్నారులు, వృద్ధులు, గర్భిణులు, అనారోగ్యంతో ఉన్నవారికి రాత్రి 09 గంటల నుంచి సుతక్ కాలం ప్రారంభమవుతుంది.

Latest Videos

vuukle one pixel image
click me!