Lunar Eclipse 2022: చంద్రగ్రహణం మీపై చెడు ప్రభావం చూపకూడదంటే ఇలా చేయాల్సిందే..

Published : May 14, 2022, 04:56 PM IST

Lunar Eclipse 2022: జ్యోతిష్యం ప్రకారం..  గ్రహణ సమయంలో మనపై చెడు ప్రభావం పడుతుందట. అయితే అలా జరకూడదంటే కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాల్సిందేనంటున్నారు జ్యోతిష్యులు. అవేంటంటే.. 

PREV
19
Lunar Eclipse 2022: చంద్రగ్రహణం మీపై చెడు ప్రభావం చూపకూడదంటే ఇలా చేయాల్సిందే..

ఈ ఏడాది రెండు చంద్రగ్రహణాలు ఏర్పడనున్నాయి. ముఖ్యంగా ఏడాది ఏర్పడే మొదటి చంద్రగ్రహణం రోజునే  బుద్ద పూర్ణి కూడా రానుంది. అందుకే ఈ గ్రహణానికి ఇంత ప్రత్యేకత ఏర్పడింది. 

29

2022 లో మొదటి చంద్రగ్రహణం ఈ నెల 16 తేదిన సరిగ్గా ఉదయం 07:02 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:20 గంటలకు ముగుస్తుంది. కానీ ఈ చంద్రగ్రహణం మన దేశంలో మాత్రం కనిపించదు. అంటే సూతకాలం చెల్లదనే చెప్పాలి. 

39

కాగా ఈ గ్రహణ సమయంలో అంటే సూతకాలంలో ఎలాంటి శుభకార్యాలను పెట్టుకోరు. ఇక్కడ కనిపించకపోయినా ఎంతో కొంత గ్రహణ ప్రభావం ఉంటుందని నమ్ముతుంటారు. అయితే జ్యోతిష్యం ప్రకారం గ్రహణం సమయంలో మనపై చెడు ప్రభావం పడకూడదంటే ఈ నియమాను ఖచ్చితంగా పాటించాల్సిందేనంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 
 

49

గ్రహణ సమయంలో 'ఓం గ్రాన్ గ్రీన్ గ్రున్స్: గురవే నమః' అనే గురు మంత్రాన్ని జపిస్తే ఎలాంటి దుస్ఫ్రభావాలు మీపై పడవట. అంతేకాదు ఈ మంత్రాన్ని జపిస్తే.. అంతా మంచే జరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. 

59

ఇక ఈ చంద్రగ్రహణంలో ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే గ్రహణ సమయంలో మృత్యుంజయ మంత్రాన్ని జపించాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీనివల్ల దీర్ఘకాలిక రోగాలు సైతం నయమవుతాయట. 
 

69

గ్రహణం రాకముందు మీరు తినే ఆహారంలో తులసి ఆకులను వేయడంతో పాటుగా.. గ్రహణ సమయంలో  కొన్ని తులసి ఆకులను నోట్లో కూడా వేసుకోవాలని పండితులు చెబుతున్నారు. 

79

జ్యోతిష్యులు తెలుపుతున్న వివరాల ప్రకారం.. గ్రహణం ముగిసిన తర్వాతే కాదు గ్రహణానికి ముందు కూడా తలస్నానం చేయాలని చెబుతున్నారు. 
 

89

గ్రహణ సమయంలో గాయత్రీ మంత్రాన్ని జపిస్తే అన్నీ శుభాలే జరుగుతాయి. ఎందుకంటే ఈ మంత్రం  చాలా పవిత్రమైంది. ఈ మంత్రం జపించడం వల్ల దుష్ప్రభావాలు మీపై పడే అవకాశమే ఉండదు. 

99

గ్రహణం ఏర్పడిన తర్వాత లక్ష్మీదేవి నామ స్మరణ చేయడం కూడా మంచిదంటున్నారు జ్యోతిష్యులు. ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహం మీపై పడుతుందట. 

click me!

Recommended Stories