Face Beauty Tips:వావ్ ..ఈ కూరగాయ ముఖంపై మచ్చలను తొలగించడమే కాదు..మీ అందాన్ని కూడా పెంచుతుంది..

Published : May 14, 2022, 03:12 PM IST

Face Beauty Tips: వంకాయలో ఉండే పోషకాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాదు ఇవి ముఖంపై ఉండే మచ్చలను వదిలించి.. ముఖాన్ని కాంతివంతంగా తయారుచేస్తాయి..

PREV
16
Face Beauty Tips:వావ్ ..ఈ కూరగాయ ముఖంపై మచ్చలను తొలగించడమే కాదు..మీ అందాన్ని కూడా పెంచుతుంది..

Face Beauty Tips: ముఖంపై మచ్చలను ఎప్పటికప్పుడు వదిలించుకోకపోతే అవి ఫ్యూచర్ లో మొండి మచ్చలుగా తయారవ్వొచ్చు. అప్పుడు మచ్చలు అంత సులువుగా వదిలిపోవు.  ఇలాంటి సమస్యలతో బాధపడేవారు నలుగురిలో ఇబ్బందిని ఎదుర్కోవాల్సి ఉంటుంది
 

26
brinjalc

అయితే  ఈ మచ్చలను వదిలించుకోవాలంటే ఖరీదైన ప్రొడక్ట్స్ నే వాడక్కర్లేదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే ఒక ప్రత్యేకమైన హోం రెమిడీతో కూడా ఈ సమస్యను వదిలించుకోవచ్చు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

36

ముఖానికి వంకాయ ఏ విధంగా ప్రయోజనం కలిగిస్తుంది.. సాధారణంగా మనం వంకాయలను కేవలం కూర చేసుకునే తింటుంటా. నిజానికి ఈ కూరగాయను కూరగానే కాదు..  ముఖ సౌందర్యానికి కూడా ఉపయోగిస్తారన్న విషయం మీకు తెలుసా..అవును వంకాయను వివిధ రకాలుగా ఉపయోగించి ముఖంలోని మచ్చలను మటుమాయం చేయొచ్చు. 

46

వేసవిలో మండుటెండలు, వేడి గాలుల వల్ల టానింగ్, సన్ బర్న్ వంటి సమస్యల వల్ల ముఖంపై మచ్చలు ఏర్పడతాయి. ఇలాంటప్పుడు వంకాయ రసం ఈ సమస్యలను తొలగించడనికి ఎంతో సహాయపడుతుంది. వంకాయ జ్యూస్ లో ఫైటోన్యూట్రియెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మపు చికాకును తగ్గించడానికి ఎంతో సహాయపడతాయి. 

56

ముఖం మృదువుగా మారుతుంది.. కాలుష్యం, చెడు ఆహారాల కారణంగా ముఖంపై చెడు ప్రభావం పడుతుంది. మురికిగా తయారవుతుంది. దీంతో చర్మం పొడిగా మారడమే కాదు నిర్జీవంగా మారుతుంది. కాగా వంకాయలో 90 శాతం నీరుంటుంది. ఇది మీ చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడానికి సహాయపడుతుంది. అంతేకాదు మీ ముఖాన్ని మృదువుగా తయారుచేస్తుంది. 

66

వయసు పెరుగుతున్న కొద్దీ ముఖంపై ముడతలు వస్తుంటాయి. వీటిని నివారించడానికి చాలా మంది నానారకాల ప్రయోగాలు చేస్తుంటారు. అయితే ఇలాంటి వారికి వంకాయ  బాగా సహాయపడుతుంది. వంకాయను పేస్ట్ గా చేసుకుని ఫేస్ మాస్క్ వేసుకుంటే మీ ముఖంలో గ్లో పెరుగుతుంది. అలాగే ముడతలు కూడా పోతాయి. ఈ కూరగాయలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ తో పోరాడటానికి ఎంతో సహాయపడతాయి. ఈ ఫేస్ మాస్క్ తో మఖం అందంగా కనిపించడంతో పాటుగా ముఖంలో గ్లో కూడా పెరుగుతుంది. అలాగే నల్లని మచ్చలు కూడా తగ్గిపోతాయి. 

click me!

Recommended Stories