Coronavirus : ‘లాంగ్ కోవిడ్’ లక్షణాలు.. జర పైలం..

First Published | Apr 22, 2022, 3:38 PM IST

Coronavirus : కోవిడ్-19 బారిన పడుతున్న వారు చాలా మందే ఉన్నారు. అయితే ఇందులో 30 శాతం మంది దీని నుంచి కోలుకున్నవారిలో దీర్ఘకాలిక కోవిడ్ లక్షణాలు కనిపిస్తున్నాయని నిపుణులు తేల్చి చెబుతున్నారు. 

Coronavirus : ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది కోవిడ్ బారిన పడుతున్నారు. కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నాయన్న క్రమంలోనే మళ్లీ దీని వ్యాప్తి తీవ్రస్థాయికి చేరుకుంటోంది. కరోనా ముప్పు నుంచి తప్పించుకునేందుకు  టీకాలు వేయించుకున్నప్పటికీ ఈ మహమ్మారి ఇంకా సోకుతూనే ఉంది. 
 

అంతేకాదు దీనినుంచి బయటపడ్డాక ఎంతో మంది దీర్ఘకాలిక కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్నారు. పలు నివేధికల ప్రకారం.. 30 శాతం మంది కరోనా నుంచి కోలుకున్నాకా ‘లాంగ్  కోవిడ్’ లక్షణాలతో బాధపడుతున్నారట. 


కరోనా నుంచి కోలుకున్నవారిలో ఈ మహమ్మారికి సంబంధించిన స్మూక్ష వ్యాధి కణాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంతోనే వీరిలో దీర్ఘకాలిక లక్షణాలు కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. 

దీర్ఘకాలిక కోవిడ్ లక్షణాలు.. కరోనా నుంచి బయటపడ్డాక శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపించడం, శ్వాస ఆడకపోవడం, ఏకాగ్రత దెబ్బతినడం, నిద్రలేమి సమస్యతో బాధపడటం, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయి. 

అలాగే నిరంతరాయంగా దగ్గు రావడం, ఛాతిలో నొప్పి పుట్టడం, మాట్లాడటంలో ఇబ్బంది కలగడం, కండరాల నొప్పులు, వాసన , రుచి తెలియకపోవడం, ఆందోళన, డిప్రెషన్ సమస్య బారిన పడటం వంటివి దీర్ఘకాలిక లక్షణాలు. అలాగే వీరిలో జ్వరం, కళ్లు తిరగడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజెల్స్ పరిశోధకులు చెబుతున్నారు. 

అధిక బాడీ మాస్ ఇండెక్స్, డయాబెటీస్ సమస్యలతో బాధపడేవారు కరోనా బాధితులుగా ఉంటే.. వీరిలోనే దీర్ఘకాలిక కరోనా లక్షణాలు ఎక్కువగా ఉంటున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. 

థర్డ్ వేవ్ తర్వాత కాస్త తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్.. ప్రస్తుతం విపరీతంగా వ్యాపిస్తోంది. దీంతో ప్రపంచ దేశాలన్నీ అప్రమత్తం అయ్యాయి. మునపటిలా మాస్క్ ను తప్పనిసరి చేశాయి. అవసరమైతేనే బహిరంగ ప్రదేశాల్లో తిరగాలని హెచ్చరిస్తున్నాయి. అందులోనూ కేంద్రం ముందస్తు చర్యలను చేపట్టింది. ప్రజలు వైరస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది. 

Latest Videos

click me!