పడక గదిపై ఆసక్తి తగ్గిందా.. ఇలా ట్రై చేయండి

First Published Jul 20, 2019, 1:23 PM IST

మొదట్లో ఉన్న ఇంట్రస్ట్ ఇప్పుడు ఉండటం లేదని చెప్పేవారి సంఖ్య చాలా ఎక్కువే. ఈ అనాసక్తి దంపతుల మధ్య దూరం మరింత పెంచి..  సంసార జీవితానికే చిక్కులు తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది. 

శృంగారంపై ఆసక్తి లేనివాళ్లు ఎవరు ఉంటారు చెప్పండి. మరీ ముఖ్యంగా కొత్తగా పెళ్లైన దంపతులకైతే ఈ ఆలోచనలే ఎక్కవగా ఉంటాయి. అయితే.. ఈ ఆసక్తి సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ తగ్గిపోతుందని చాలా మంది భావిస్తున్నారు.
undefined
మొదట్లో ఉన్న ఇంట్రస్ట్ ఇప్పుడు ఉండటం లేదని చెప్పేవారి సంఖ్య చాలా ఎక్కువే. ఈ అనాసక్తి దంపతుల మధ్య దూరం మరింత పెంచి.. సంసార జీవితానికే చిక్కులు తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది. అయితే... దీనికి చక్కటి పరిష్కారం ఉందని నిపుణులు చెబుతున్నారు.
undefined
శృంగారంపై ఆసక్తి తగ్గిన వారి ఒంటిపై ప్రకాశవంతమైన కాంతి తగిలేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
undefined
ముఖ్యంగా పురుషులకు ప్రకాశవంతమైన కాంతి తగిలేలా చేస్తే టెస్టోస్టీరాన్ హ్మార్మోన్ స్థాయిలు పెంచేలా చేస్తుందని.. దాని ద్వారా పగక గదిపై ఆసక్తి పెరుగుతుందని వారు చెబుతున్నారు. అంతేకాదు ఆ హార్మోన్ లెవల్ పెరిగితే శృంగారంలో తృప్తి కూడా త్వరగా పొందగలుగుతారని వారు చెబుతున్నారు.
undefined
వాతావరణలో మార్పులు, కాలాలను బట్టి శృంగార ఆసక్తిలో మార్పులు వస్తున్నట్లు ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. ఈ నేపథ్యంలో ఈ సర్వేపై ఇటలీ శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. శృంగారం మానసిక ప్రతిస్పందనలపై ప్రకాశవంతమైన కాంతికి ఉన్న సంబంధాన్ని వారు పరిశీలించారు.
undefined
శృంగారం పట్ల ఎలాంటి ఆసక్తి లేని కొందరు పురుషులను ఎంపిక చేసి వారిని ప్రతిరోజూ ఉదయం 30 నిమిషాల పాటు కాంతి చికిత్స అందించారు. రెండు వారాల తర్వాత వారిలో టెస్టోస్టీరాన్ హార్మోన్ స్థాయి పెరిగినట్లు గుర్తించారు.
undefined
ఆ తర్వాత వారిలో ఆ ఆసక్తి పెరగడంతోపాటు.. ఎక్కువ తృప్తి పొందుతున్నట్లు తెలుసుకోగలిగారు. సాధారణంగా ఎండ తక్కువగా ఉండే కాలాల్లో శరీరంలోని టెస్టోస్టీరాన్ హార్మోన్ల స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయని... దీనిని కాంతి చికిత్సతో సరిచేయవచ్చని వారి పరిశోధనలో తేలింది.
undefined
click me!