ఇది ఎల్‌జిబిటిక్యూ ప్రైడ్ మంథ్. ఎల్‌జిబిటిక్యూ... వాళ్లు మనలోని వారే. కాకపోతే కొంత ప్రత్యేకం. వారి గురించి వారి హక్కుల గురించి అవగాహనతో ఉంటూ వారికి సపోర్ట్ చేయాలి. ఇప్పటికే సమాజంలో చాలామార్పు వచ్చింది. వీరిని అంగీకరిస్తున్నారు. అనేక ప్రభుత్వాలు వీరికోసం చట్టాలూ చేశాయి.
అయితే ఇప్పటికీ కొన్ని అపోహలు, వివక్ష అక్కడక్కడా కనిపిస్తున్నాయి. అందుకే వీరు అంత త్వరగా తమను తాము రివీల్ చేసుకోరు. అయితే మీ స్నేహితుడో, మీ ఇంట్లోని వారో ఈ గ్రూప్ కి చెందినవారని మీకు తెలిస్తే.. వారిని మీరు అంగీకరించండి.. వారికి మద్ధతు ఇవ్వడానికి మీరు చేయాల్సిందల్లా..
వారిని వారిగా అంగీకరించండి. మీరేమనుకుంటారో అని ఆత్మన్యూనతతో వారి గుర్తింపు మార్చుకోకుండా ఉండేలా చూడండి. వారితో హృదయపూర్వక స్నేహితుల్లా మెలగండి. ఎల్‌జిబిటిక్యూను ఆమోదించడంలో ఇదే కీలకం.
అవగాహన పెంచుకోండి : ఎల్‌జిబిటిక్యూ కు సంబంధించిన పూర్తి అవగాహన కోసం దానిమీద స్టడీ చేయండి. అందులోని నిజానిజాలు తెలుసుకుని వారితో మెలగండి. వారికి మీ పూర్తి సహాయసహకారాలు అందించండి. వారి గుర్తింపు ఏదైనా సరే వారిని ఉనికిని ఇష్టపడండి.
ఓపెన్ మైండెడ్ గా ఉండాలి.. మీ స్నేహితులెవరైనా ఎల్‌జిబిటిక్యూ అని మీతో పంచుకున్నప్పుడు.. అతని ఆమె తన లైంగిక గుర్తింపును మీతో పంచుకున్నప్పుడు మీరు చేయగలిగేది ఓపెన్-మైండెడ్ తో అంగీకరించడమే. బహిరంగంగా వారితో మీ స్నేహాన్ని కొనసాగించడమే వారికి మీరిచ్చే పూర్తి మద్దతు.
తనలో కలిగే సంఘర్షణ గురించి మీ స్నేహితుడు లేదా స్నేహితురాలు మీతో పంచుకోవాలనుకున్నప్పుడు ఓపిగ్గా వినండి. మంచి స్నేహితుడి లక్షణం అది. మధ్యలో కట్ చేయకుండా ఆపకుండా తనేం చెబుతున్నారో పూర్తిగా శ్రద్ధగా వినండి.
ఎల్‌జిబిటిక్యూ స్నేహితులతో సంభాషించేప్పుడు.. వారిని పిలిచేటప్పుడు వారి గుర్తింపుకు ప్రాముఖ్యత ఉంటుంది. వారు అతడు, ఆమె, లేదా థార్డ్ జెండర్ ఎలా గుర్తింపుకు ఇష్టపడతారు.. సింగిల్ గానా, ఫ్లూరల్ గానా ముందు తెలుసుకుని అలా ప్రాముఖ్యతనివ్వడం ముఖ్యం.
ఎల్‌జిబిటిక్యూ గురించి ఇప్పటికీ సమాజంలో చాలా వివక్ష ఉంది. దాన్ని మార్చే ప్రయత్నంలో భాగం కండి. కనీసం అలా మాట్లాడేవారు ఎదురుపడినప్పుడు వ్యతిరేకించండి.
మీరు వారిని స్నేహితులుగా అంగీకరించినా.. మీతో పాటే ఉన్నా కూడా వారి ప్రతీ విషయాల్లో జోక్యం తగదు. వారికంటూ స్పేస్ ఇవ్వండి. తామేంటో తాము ఎక్స్ ప్లోర్ చేసుకునే అవకాశాన్ని వారికి కల్పించండి.
మీరు వారిని స్నేహితులుగా అంగీకరించినా.. మీతో పాటే ఉన్నా కూడా వారి ప్రతీ విషయాల్లో జోక్యం తగదు. వారికంటూ స్పేస్ ఇవ్వండి. తామేంటో తాము ఎక్స్ ప్లోర్ చేసుకునే అవకాశాన్ని వారికి కల్పించండి.
మీ మిగతా స్నేహితులకు ఇచ్చిన ప్రాముఖ్యమే తనకూ ఇవ్వండి. మీ ప్రతీ పార్టీలు, అవుటింగ్ లలో తననూ చేర్చుకోండి.
ప్రత్యేక వ్యక్తికి స్నేహితులుగా మీరూ వారికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనండి. వారికి ఎంతో ముఖ్యమైన ప్రైడ్ పరేడ్‌లు, ఎల్‌జిబిటిక్యూ ఈవెంట్స్ కు తనతో పాటు కలిసి వెళ్లండి.
వారి స్నేహితులుగా మీరు వారి ఐడెంటిటీని గుర్తించండి. దానివల్ల వ్యతిరేకత ఎదుర్కోవలసి వచ్చినా మీ స్నేహితుల విషయంలో గర్వపడండి.
వారి స్నేహితులుగా మీరు వారి ఐడెంటిటీని గుర్తించండి. దానివల్ల వ్యతిరేకత ఎదుర్కోవలసి వచ్చినా మీ స్నేహితుల విషయంలో గర్వపడండి.