2. పిల్లల నిర్ణయాలకు గౌరవం ఇవ్వాలి..
చాలామంది తల్లిదండ్రులు తమ కలలను పిల్లలపై రుద్దుతారు. కానీ మాధవన్ వేదాంత్ విషయంలో అలా చేయలేదు.
వేదాంత్‌కు సినిమాల కంటే స్విమ్మింగ్ అంటే ఇష్టమని తెలిసినప్పుడు, మాధవన్ అతన్ని ఏ రోజూ బలవంతం చేయలేదు.
పిల్లల ఆసక్తి దేనిలో ఉందో గుర్తించి, అందులో వారు రాణించేలా ప్రోత్సహించాలి కానీ, మన ఇష్టాలను వారిపై రుద్దకూడదు అని మాధవన్ చెప్పారు.
3. సౌకర్యాల కంటే క్రమశిక్షణే ముఖ్యం
కోట్లాది రూపాయల ఆస్తి ఉన్నప్పటికీ, తన కొడుకును ఒక సామాన్యుడిలాగే పెంచారు మాధవన్.విలాసవంతమైన జీవితం కంటే క్రమశిక్షణ, కష్టపడే తత్వం పిల్లలకు అలవాటు చేయాలి అని మాధవన్ చెప్పారు.
వేదాంత్ ఒలింపిక్స్ కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు, మాధవన్ కుటుంబం మొత్తం దుబాయ్‌కు షిఫ్ట్ అయ్యింది. అంటే, పిల్లల లక్ష్యం కోసం తల్లిదండ్రులు త్యాగం చేయాలే తప్ప, వారిని సోమరిపోతులుగా మార్చే విలాసాలు ఇవ్వకూడదు.. అని మనం మాధవన్ నుంచి నేర్చుకోవచ్చు.