
నేటి మహిళలు.. చీర కట్టుకునేటప్పుడు చీర రంగుకే కాదు, దానికి తగ్గ బ్లౌజ్ డిజైన్‌కు కూడా ఇప్పుడు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. రెగ్యులర్‌గా చూసే ఫ్లోరల్ డిజైన్స్, ఎంబ్రాయిడరీ, స్టోన్ వర్క్, మగ్గం వర్క్ కాకుండా ఇప్పుడు మరో కొత్త ట్రెండ్ మగువల మనసు దోచుకుంటోంది.
అదే మన ఇంటి ముందు రోజూ వేసుకునే 'సిక్కు కోలం' అంటే (మెలికల ముగ్గు) డిజైన్‌ను బ్లౌజ్‌పై వేసుకోవడం. వాకిట్లో మొదలైన ఈ ముగ్గుల అందం ఇప్పుడు బ్లౌజ్‌పైనా మెరిసిపోతోంది. ఒక గీతతో మరో గీత పెనవేసుకుని ఉండే ఈ ముగ్గుల డిజైన్‌ను బ్లౌజ్‌పై వేసినప్పుడు చాలా అందంగా, వెరైటీగా కనిపిస్తోంది. సంప్రదాయం సైతం ఉట్టిపడుతోంది.
ఎక్కువ చమ్కీలు, స్టోన్స్, హెవీ ఎంబ్రాయిడరీ లేని చీరల మీద ఈ సిక్కు కోలం బ్లౌజ్ వేసుకుంటే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుంది. చాలా సింపుల్‌గా ఉండే చీరను కూడా ఈ వెరైటీ బ్లౌజ్ డిజైన్‌తో స్టైలిష్‌గా మార్చేయొచ్చు. ఒకవేళ చీరలో అప్పటికే హెవీ బార్డర్ లేదా వర్క్ ఉంటే, బ్లౌజ్‌పై పెద్ద డిజైన్ కాకుండా మెడ, చేతులు లేదా వీపుపై చిన్న ముగ్గు డిజైన్ వేయించుకోవడం బెటర్.
పట్టు చీరలు, కాంచీపురం చీరలు, సిల్క్ కాటన్ లాంటి ట్రెడిషనల్ చీరల మీదకు ఈ డిజైన్ బ్లౌజ్ వేసుకుంటే.. అటు ట్రెడిషనల్, ఇటు మోడ్రన్ లుక్ అదిరిపోతుంది.
అందరిలా కాకుండా నాకంటూ ఒక స్పెషల్ డిజైన్ ఉండాలి అనుకునే మహిళలకు ఈ సిక్కు కోలం బ్లౌజ్ సూపర్ ఛాయిస్. సింపుల్ లైన్స్ నుంచి హెవీ ముగ్గుల డిజైన్ వరకు మీ చీరను బట్టి దీన్ని డిజైన్ చేసుకోవచ్చు.
ఈ బ్లౌజ్ డిజైన్‌లో మెయిన్ హైలైట్ ఆ మెలికల గీతలే. బ్లౌజ్ వెనుక భాగం, చేతులు, మెడ చుట్టూ ఈ ఎంబ్రాయిడరీ లేదా ప్రింట్ వర్క్ చేయించుకుంటే భలే ఉంటుంది.
ముగ్గు అందం ఏమాత్రం తగ్గకుండా, బ్లౌజ్‌పై సరైన ప్లేస్‌లో డిజైన్ చేయిస్తే చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది. బ్లౌజ్ వెనుక భాగం మొత్తం కవర్ చేయకుండా, మధ్యలో ఒక పెద్ద సిక్కు కోలం ఎంబ్రాయిడరీ చేయిస్తే ట్రెడిషనల్‌గా ఉంటూనే అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
చేతుల అంచున చిన్న చిన్న సిక్కు కోలం డిజైన్లను వరుసగా వేయిస్తే, ఎక్కువ వర్క్ లేకుండానే బ్లౌజ్‌కు మంచి ట్రెడిషనల్ టచ్ వస్తుంది. కొంచెం వెరైటీగా ట్రై చేయాలి అనుకునేవాళ్లు స్లీవ్స్ మొత్తం కంటిన్యూ అయ్యేలా ఈ డిజైన్ వేయించుకోవచ్చు. ముఖ్యంగా సింగిల్ కలర్ బ్లౌజ్‌పై ఇది చాలా గ్రాండ్‌గా కనిపిస్తుంది.
బ్లౌజ్ ముందు భాగంలో పెద్ద డిజైన్ కాకుండా, సన్నని సిక్కు కోలం లాంటి కంటిన్యూస్ లైన్ వర్క్ చేయిస్తే సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ వస్తుంది. మెడ చుట్టూ ఈ ముగ్గుల డిజైన్ వేయిస్తే నెక్ లైన్ హైలైట్ అవుతుంది. సింపుల్ బ్లౌజ్‌లకు ఇది బెస్ట్ ఆప్షన్.
పెద్ద డిజైన్ వద్దు అనుకునేవాళ్లు వీపు మధ్యలో చిన్న రౌండ్ షేప్ సిక్కు కోలం వేయించుకుంటే చాలు. తక్కువ వర్క్‌తోనే బ్లౌజ్‌కు అదిరిపోయే లుక్ తీసుకురావచ్చు.
ముగ్గు అనగానే మనకు ట్రెడిషనల్ లుక్ గుర్తొస్తుంది. అందుకే ఈ సిక్కు కోలం డిజైన్ బ్లౌజులు ట్రెడిషనల్ చీరలకు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాయి. ముఖ్యంగా కాంచీపురం పట్టు చీర కట్టుకున్నప్పుడు, దానికి మ్యాచింగ్ కలర్‌లో ఈ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ వేసుకుంటే ట్రెడిషనల్ ప్లస్ ఫ్యాషన్ లుక్ మీ సొంతం అవుతుంది. అలాగే చెట్టినాడ్ కాటన్, చేనేత చీరలు, కాటన్ సిల్క్, సుంగుడి, ఆర్గానిక్ కాటన్ లాంటి సింపుల్ చీరల మీదకు కూడా ఈ డిజైన్ చాలా బాగుంటుంది.