
1. మీ ఇంట్లో 15-30 ఏళ్ళ అమ్మాయి/యువతి ఉందా?
2. పది... ఇంటర్ దాక ఆమె చదువులో చురుకయ్యిందా?
3.తెలివితేటలు, independent భావాలు ఆమెలో మెండుగా ఉన్నాయా..?
4. గత కొంత కాలంగా ఆమె ప్రవర్తన చిత్రంగా మారిందా?
5. గది తలుపేసుకొని, ఒంటరిగా గడపడానికి ఇష్టపడుతోందా?
6. మీ పై కోపం చిరాకు ప్రదర్శిస్తోందా..?
7. అబద్దాలు చెప్పడం, ఆత్మ హత్య చేసుకొంటానని బెదిరిస్తోందా..?
అయితే ఆమె ఆమెకు కొరియన్ దెయ్యం పట్టినట్టే..!
దెయ్యాలు లేవు .
ఇది వేరే రకం దెయ్యం..!
ఇప్పటిదాకా పెద్దగా ఎవరూ రాయని, మాట్లాడని భూతం.
భారత దేశం లో లక్షలాది మంది యువ మహిళలకు పట్టిన దెయ్యం.
మీ వయసు .. 40 ప్లస్..
చెప్పండి .. కొరియా గురించి మీకు ఏమి తెలుసు..?
జస్ట్ ఒకటి రెండు పాయింట్స్ కదా..?
మీకు తెలియని ఎన్నో విషయాలు ఇవిగో...
భారతీయ అమ్మాయిలు కొరియా డ్రామాలకు, పాప్ మ్యూజిక్ కు పిచ్చ అభిమానులు.
పచ్చ బొట్టు పొడిపించుకొన్న వారు .. కొరియా భాషను నేర్చుకొంటున్న వారు..
కొరియా అభిమానుల కమ్యూనిటీ, ఆన్లైన్ గ్రూప్స్ తో ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, రెడ్దిట్ నిండి పోయింది.
ఈ అభిమానుల గ్రూప్స్ ఈవెంట్స్ నిర్వహిస్తారు.
ప్రసంగాలిస్తారు.
ఇదొక మేనియా .. పెద్దవారికి పెద్దగా తెలియని మేనియా..
సమస్యకు మూలం..!
ఇండియన్ మెయిన్ స్ట్రీమ్ సినిమా హీరో ఓరియెంటెడ్.
కాలం మారింది.
చదువుల్లో, కాంపిటేటివ్ పరీక్షల్లో, ఉద్యోగాల్లో మహిళలదే పైచేయి.
అయినా భారతీయ సినిమా మారలేదు.
హీరో తెలివైనోడు..
హీరోయిన్ జస్ట్ ఒక అందాల బొమ్మ..
ఆమెకు వ్యక్తిత్వం ఉండదు, తెలివి ఉండదు .
రాస్తూ పొతే భారతీయ సినిమా లో పురుషాధిక్య సంస్కృతి గురించి ఒక పుస్తకం అవుతుంది.
కొరియన్ సినిమా.. పాప్ మ్యూజిక్..
అమ్మాయి తెలివైంది, ధైర్యవంతురాలు, సమస్యల్ని ఎదిరిస్తుంది.. పోరాడుతుంది..
ఎక్కడైతే భారతీయ సినిమాలో గ్యాప్ ఉందో.. కొరియన్ డ్రామా అక్కడే దూరింది.
కొరియన్ సినిమాలో చూపించే సమస్యలు నిజం..
యువ మహిళా కోణంలో ఈ సినిమాలు, డ్రామాలు... అద్భుత చిత్రీకరణలు.
హీరో హీరోయిన్ స్లిమ్ గా అందంగా ఉంటారు..
చిత్రీకరణ సూపర్ రిచ్. లేటెస్ట్ కెమెరాలు .. ట్రేండింగ్ మ్యూజిక్ .. స్టూడియోస్ ..
మగాళ్లకు హింసంటే ఇష్టం.
మహిళలకు అది పెద్దగా నచ్చదు.
ఫామిలీ డ్రామా,
రొమాన్స్
చదువు ..
ఉద్యోగం ..
అక్కడ మహిళా ఎదుర్కొనే సమస్యలు ..
పురుషాధిక్యత ...
వాటిని ఎదిరించడం..
ఇలా యువ మహిళ ఆలోచించే ప్రతి అంశం ఇందులో ఉంటుంది.
ఒక్క మాటలో చెప్పాలి అంటే యువ మహిళ మనోగతానికి కొరియన్ డ్రామా ప్రతిబింబం.
1. ఇందులో చూపే సమస్యలు నిజం.
దానికి వారు చూపే పరిష్కారం డ్రమాటిక్ గా వాస్తవానికి ఆమడ దూరంలో ఉంటుంది.
యువమహిళల్లో ఇది పలాయన వాదానికి దారి తీస్తోంది.
2. ఇదొక పెద్ద అడిక్షన్. ఒక్కసారి దూరితే బయటకు రాలేరు. అదేపనిగా గంటలు గంటలు చూస్తూ కాలం గడిపేస్తారు.
4. విపరీత భావోద్వేగాలు వచ్చేస్తాయి. కోపం.. మానసిక కుంగుబాటు.. స్ట్రెస్.. ఆత్మహత్య ఆలోచనలు.. నేల విడిచి సాము చెయ్యడం.. పలాయనవాదం.
5. మనం కూడా కొరియన్ బ్యూటీ లా మారాలి..! వారిది మంగోలాయిడ్ జాతి..! ఇక్కడ బయాలజీ వేరు..!
ప్లాస్టిక్ సర్జరీలు .. సిలికాన్ ఇంజెక్షన్స్
మన బాయ్ ఫ్రెండ్ కొరియన్ అబ్బాయిలా హ్యాండ్సమ్ గా ఉండాలి.. బ్రాడ్ మైండెడ్ గా ఉండాలి. ఇక్కడ సరుకు వేరు
వాస్తవానికి వెయ్యి మైళ్ళ దూరంలో ఆలోచనలు ఆకాంక్షలు..!
అవి తీరక నిరాశా నిస్పృహలు..
ఈ సినిమాలు తీసే దక్షిణ కొరియా కు ఒక్కసారి వెళదాము .
అమ్మాయిలు పెళ్ళొద్దు అంటున్నారు. పెళ్లి నాటికి సగటు వయస్సు 32.
"పెళ్లి మెడకు జంజాటం. లైఫ్ లో రొమాన్స్ ఉంటే చాలు"అనుకొనే వారి సంఖ్య పెరిగిపోతోంది.
కొరియన్ యువతుల ఎంజోయ్మెంట్ కోసం కొన్ని పొరుగు దేశాల్లో బాయ్స్ స్త్రీట్స్ వెలుస్తున్నాయి.
2.1 ఉండాల్సిన జనన రేట్ 0.75 కి పడిపోయింది.
వృద్ధుల శాతం పెరిగిపోతోంది. పని చేసే వారి సంఖ్య భారీగా తగ్గి ఆర్థిక మాంద్యం.
కొరియన్ డ్రామాకు పాప్ మ్యూజిక్ కు ... అమ్మాయిలేనా అభిమానులు..?
అబ్బాయిల/యువకులకు పట్టిన దెయ్యాలు వేరు .. బెట్టింగ్.. గంజాయి.. హింస.. శాడిజం.. బుల్లియింగ్.
కొరియన్ అభిమానుల్లో 90 శాతం అమ్మాయిలే.. !
సమాజం నిద్ర లేవాలి.
మహిళకు సముచిత స్థానం ఇవ్వాలి.
సమస్యల చిత్రీకరణ సరే... సరైన పరిష్కారం ఇచ్చే సినిమాలు రావాలి.
సినిమా వేరు... జీవితం వేరు... సమస్య వాస్తవం అయితే పరిష్కారం కూడా వాస్తవం కావాలి అనే ఇంగిత జ్ఞానం అందరికీ ముఖ్యంగా యువతకు విద్యార్థులకు రావాలి.
విద్య వ్యవస్థ మారాలి.
ముగింపు :
ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న అమ్మాయి కాలేజీ కి పోనంటోంది. ఇంజనీరింగ్ అంటే నాకు ఇష్టం లేదు. బెంగుళూరు లో బేకరీ కోర్స్ చేస్తా. ఆరు నెలల కోర్స్... జస్ట్ అయిదు లక్షలు ఫీజ్. అంటోంది.
తల్లితండ్రి బతిమాలాడారు. ఇంజనీరింగ్ జస్ట్ ఒక ఇయర్. ఇది కంప్లీట్ చెయ్యి. అటుపైన హోటల్ మానేజ్మెంట్ పీజీ చేద్దువు అన్నారు.
ఒప్పుకోదు. కోపం... అన్నం తినడానికి మాత్రం తలుపు తీసి బయటకు వస్తుంది. మానసిక వైద్యుడి వద్దకు తీసుకొని వెళ్లారు. ఆయన నాలుగు పేజీల లిస్ట్ రాశారు.. పరిష్కారం కాదు. నాలుగు పేజీల వ్యాసం.. సమస్య గురించి.
పరిష్కారం ఒక్కటీ అడక్కు అన్నాడేమో ..
పేరెంట్స్ నిరాశా నిస్పృహల్లో .. ఆరోగ్యం చెడగొట్టు కొంటూ..
కొరియన్ దెయ్యం దించాలి.
వేప మండలు కాదు..
కీలెరిగి వాత పెట్టాలి ..