pregnancy
Lemon Juice: గర్భిణులు తీసుకునే ఆహారంలో ప్రోటీన్లు , విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉండేట్టు చూసుకోవాలి. వీటితోనే పిండం ఆరోగ్యంగా పెరుగుతుంది. ముఖ్యంగా ప్రెగ్నీన్సీ ఉన్న మహిళలు కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉంటేనే మంచిది. వైద్యుడిని సంప్రదించి.. ఎలాంటి ఆహారం తీసుకోవాలి.. ఎలాంటి ఆహారం తీసుకోకూడదో తెలుసుకోవాలి. ఎందుకంటే కొన్ని రకాల ఆహార పదార్థాలు మీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు అస్సలు మంచివి కావు.
అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలు మాత్రం గర్భిణులకు ఎంతో మేలు చేస్తాయి. అందులో నిమ్మకాయలు, బెర్రీలు, నారింజ, ద్రాక్షవంటి సిట్రస్ ఫ్రూట్స్ గర్భిణులకు ఎంతో అవసరం కూడా. ఎందుకంటే ఈ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి సహాయపడుతుంది.
ముఖ్యంగా గర్భంతో ఉన్నప్పుడు వీరికి ఇమ్యూనిటీని పెంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇమ్యూనిటీ పవర్ అధికంగా ఉంటేనే గర్భిణులు అనేక వ్యాధులు, ఇన్ఫెక్షన్ నుంచి రక్షణ పొందుతారు.
అయితే కొంతమంది గర్భిణులు నిమ్మకాయలను అస్సలు తీసుకోకూడదని చెబుతూ ఉంటారు. కానీ వైద్యుల అభిప్రాయం ప్రకారం.. నిమ్మకాయ, నిమ్మరసం, వంటి వాటివల్ల ప్రయోజనాలే తప్ప ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని చెబుతున్నారు. మరి గర్భిణులు నిమ్మకాయ జ్యూస్ ను తాగడం వల్ల ఎలాంటి లాభాలున్నాయో తెలుసుకుందాం పదండి..
గర్భాధారణ సమయంలో వారు హైడ్రేటెడ్ గా ఉండటం ఎంతో అవసరం. గర్బిణులు డీహైడ్రేషన్ బారిన పడకూడదంటే.. కొన్ని రకాల పండ్లను తరచుగా తీసుకుంటూ ఉండాలి. ఇందులో నిమ్మకాయ ఒకటి. ఈ పండులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
గర్భం దాల్చిన మొదటి మూడు నెలల వరకు వారు వికారం.. వాంతులు, గ్యాస్ వంటి సమస్యలతో బాధపడుతుంటారు. ఇలాంటి సమయంలో ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు నిమ్మరసం ఎంతో సహాయపడుతుంది.
ముఖ్యంగా గర్భిణులు అజీర్థి, మలబద్దకం వంటి సమస్యలను కూడా ఫేస్ చేస్తుంటారు. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందాలంటే నిమ్మరసం మంచి మెడిసిన్ లా ఉపయోగపడుతుంది.
నిమ్మకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్.. శరీరంలో ఉండే విషపదార్థాలను తొలగిస్తాయి. ఒకరకంగా చెప్పాలంటే నిమ్మరసం క్లెన్సర్ గా పనిచేస్తుందనొచ్చు.
क्या अल्ट्रासाउंड से होता है नुकसान
నిమ్మకాయ కేవలం తల్లికే కాదు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యానికి కూడా ఎంతో సహాయపడుతుంది. నిమ్మాకాయలో ఉంటే పొటాషియం కడుపులో పెరుగుతున్న బిడ్డ ఎదుగుదలకు, నరాల, ఎముకల అభివృద్ధికి ఎంతో అవసరం. అంతేకాదు ఇది చిన్నారి బ్రెయిన్ డెవలప్ మెంట్ కు కూడా ఉపయోగపడుతుంది.
కొంతమంది గర్భిణులు నెలలు నిండగానే అధిక రక్తపోటు సమస్యను ఎదుర్కొంటుంటారు. ఇది ఆ తల్లికే కాదు బిడ్డ ప్రాణాలనికి కూడా ఎంతో ప్రమాదం. ఈ అధిక రక్తపోటు కారణంగా పిల్లలు నెలలు నిండకుండానే పుట్టే ఛాన్సెస్ ఉన్నాయి.
పలు పరిశోధనల ప్రకారం.. నిమ్మఆకుల రసం అధిక రక్తపోటును నియంత్రిస్తుందట. ఎందుకంటే నిమ్మరసంలో ఉండే మెగ్నీషియం, పొటాషియం High blood pressure ను కంట్రోల్ చేయగలవు.
గర్భంతో ఉన్నచాలా మంది కాళ్ల వాపుతో ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి సమయంలో గ్లాస్ గోరువెచ్చని నీళ్లు తీసుకుని అందులో టీ స్పూన్ నిమ్మరసం కలిపి తాగాలి. దీంతో కాళ్ల వాపు ఇట్టే తగ్గుతుంది.
గోరువచ్చని నీళ్లలో కొద్దిగా రాళ్ల ఉప్పు, నిమ్మరసం కలిసి స్నానం చేస్తే కూడా.. కాళ్ల వాపు, నొప్పి ఇట్టే తగ్గిపోతాయి. తెలిసింది కదా.. నిమ్మకాయతో మంచే తప్ప చెడు లేదని.. కాబట్టి గర్భిణులూ మీరు ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా నిమ్మరసం తాగండి..