
weight lose: ప్రపంచ వ్యాప్తంగా అధిక బరువుతో బాధపడేవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూనే ఉందని తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి. అధిక బరువు సమస్యతో ఎంతో మంది ఊబకాయం బారిన పడి.. ప్రమాదకరమైన జబ్బులతో చిన్న వయసులోనే చనిపోతున్నారు.
బరువు విపరీతంగా పెరిగిపోవడానికి కారణాలు చాలానే ఉన్నాయి. లైఫ్ స్టైల్, చెడు ఆహారపు అలవాట్లు వంటి వివిధ కారణాల వల్ల అధిక బరువు సమస్య బారిన పడుతున్నారు. ముందే ఇది వేసవి కాలం.. వేసవి దాహాన్ని తీర్చుకోవడానికి రకరకాల పానీయాలను, ఐస్ క్రీములను తీసుకుంటూ ఉంటారు. వీటి వల్ల హెల్త్ పాడవడమే కాదు.. బరువు కూడా పెరుగుతారు.
కానీ ఈ వేసవికాలం మిమ్మల్ని హైడ్రేటెడ్ గా ఉంచే కొన్ని హెల్తీ ఆహార పదార్థాల వల్ల ఆరోగ్యం బాగుండటమే కాదు సులభంగా బరువు కూడా తగ్గొచ్చు. అవేంటో ఈఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం పదండి..
పుచ్చకాయ.. పుచ్చకాయలో నీటి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ పండును తినడం వల్ల బాడీ హైడ్రేటెడ్ గా ఉండటమే కాదు.. జీర్ణక్రియ వేగాన్ని కూడా పెంచుతుంది. దీంతో కేలరీలు ఎక్కువగా బర్న్ అవుతాయి. దీంతో మీరు చాలా ఫాస్ట్ గా బరువు తగ్గుతారు. కాబట్టి ప్రతిరోజూ పుచ్చకాయను బ్రేక్ ఫాస్ట్ లో తీసుకోండి.
బెర్రీలు.. వెయిట్ ను తగ్గించేందుకు బ్లూబెర్రీలు, బ్లాక్ బెర్రీలు ఎంతగానో సహాయపడతాయి. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటివల్ల అధిక బరువును ఈజీగా తగ్గొచ్చు. కాబట్టి వీటిని మీ రోజు వారి ఆహారంలో చేర్చుకోండి. వీటిని తినడం వల్ల ఒంట్లో కొవ్వు పేరుకునే అవకాశం ఉండదు.
ద్రాక్షపండు.. ద్రాక్షపండులో ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది. ఇది జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది. ఫైబర్ మన శరీరంలోకి వెళ్లి నీటితో కలిసి జెల్ వంటి పదార్థాన్ని ఏర్పరుస్తుంది. దీనివల్ల కడుపు ఎక్కువ సేపు నిండుగానే ఉన్న అనుభూతి కలుగుతుంది. దీంతో మీరు అదనంగా ఇతర ఆహార పదార్థాలను తినలేరు. మధుమేహులకు కూడా ఈ పండు ఎంతో సహాయపడుతుంది. ఈ వేసవిలో ఈ పండును ఎక్కువగా తినడం వల్ల బాడీ హైడ్రేటెడ్ గా ఉండటమే కాదు.. బరువు కూడా తగ్గుతారు.
సొరకాయ.. సొరకాయ ఈ కాలంలో ఎక్కువగా లభిస్తుంటాయి. వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు వీటిని తినడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది కూడా. వీటిలో కొలెస్ట్రాల్ చాలా తక్కువ మొత్తంలో ఉంటుంది. దీన్ని తినడం వల్ల కడుపు తేలికగా ఉంటుంది. కాబట్టి వీటిని తరచుగా తినండి.
దోసకాయ.. ఈ వేసవి కాలానికి కీరదోసకాయ మనకు దివ్య ఔషదంలా పనికొస్తుంది. వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. దీన్ని తరచుగా తినడం వల్ల మన బాడీ ఎప్పుడూ హైడ్రేటెడ్ గానే ఉంటుంది. ఈ కీరదోస కాయను తినడం వల్ల జీవక్రియ మెరుగ్గా పనిచేస్తుంది. అంతేకాదు బరువు కూడా చాలా తొందరగా తగ్గుతారు. ఈ కాలం వేడి చేయకూడదంటే కీరదోసకాయలను అలాగే తిన్నా లేదా.. సలాడ్ లేదా జ్యూస్ గా చేసుకుని తాగినా చక్కటి ఫలితం ఉంటుంది.