ఇక చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను తరచూ కొట్టడం, తిట్టడం లాంటివి చేస్తుంటారు. తల్లిదండ్రులు పిల్లలపై అరిచినప్పుడు లేదా కొట్టినప్పుడు, ఈ చెడు జ్ఞాపకశక్తి పిల్లల హృదయంలో చాలా కాలం పాటు ఉంటుంది. అదే కనుక మితిమీరితే , అది పిల్లల మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. పిల్లలకు మంచి భవిష్యత్తు కోసం, మంచి జ్ఞాపకాలతో నిండిన బాల్యాన్ని అందించడం చాలా ముఖ్యం. బాల్యంలో బాధాకరమైన మెదడు గాయం యొక్క చెత్త ప్రభావం పిల్లల మానసిక ఆరోగ్యం పై ప్రభావం చూపిస్తూ ఉంటుంది.