కూరలు ప్రతి సారీ పర్ఫెక్ట్ గా రావాలంటే కష్టమే. కొన్ని కొన్ని సార్లు కూరల్లో ఉప్పు, కారం, పులుపు, మసాలాలు ఎక్కువ అవుతుంటాయి. కానీ కూరల్లో ఏ ఒక్కటి ఎక్కువైనా.. కూరల టేస్ట్ మొత్తం మారుతుంది. కొన్ని సార్లైతే వాటిని నోట్లో కూడా పెట్టలేం. ఇలాంటి కూరలను డస్ట్ బిన్ లో వేసేస్తుంటారు. ఇలా కూరల్లో ఉప్పు కారాలు ఎక్కువైతే కొన్ని సింపుల్ చిట్కాలతో వాటిని సరిచేయొచ్చు. వీటితో కూర టేస్ట్ అస్సలు మారదు. అలాగే మరింత టేస్టీగా కూడా అవుతాయి. ఇందుకోసం ఏం చేయాలో తెలుసుకుందాం పదండి.