బ్రష్ చేసేటప్పుడు ఈ పొరపాట్లు చేస్తున్నారా..? మీ పళ్లు ఊడిపోతాయ్ జాగ్రత్త..!

కనీసం రోజుకి రెండుసార్లు బ్రష్ చేయడం కూడా చాలా ముఖ్యం. అంతేకాకుండా, బ్రష్ చేసే సమయంలో మనం కామన్ గా చేస్తున్న పొరపాట్లు ఏంటో, వాటిని ఎలా సరి చేసుకోవాలో చూద్దాం...
 

ఉదయం లేవగానే మనమందరం కామన్ గా చేసే మొదటి పని బ్రష్ చేయడం. ఇది మనకు ఒక అలవాటుగా మారిపోయింది. ఓరల్ కేర్ అనేది చాలా ముఖ్యమైన ప్రక్రియ. మనం మన శరీరాన్ని ఎలా శుభ్రపరుచుకుంటున్నామో, మన దాంతాలను, నోటిని శుభ్రం చేసుకోవడం చాలా అవసరం. అలవాటుగా బ్రష్ చేస్తున్నప్పటికీ మనం ఈ బ్రష్ చేసే విషయంలో చాలా పొరపాట్లు చేస్తుంటాం. నిజానికి, మనం బ్రష్ చేసేటప్పుడు కనీసం రెండు నిమిషాలు కేటాయించాలి. కనీసం రెండు నిమిషాలపాటు బ్రష్ చేయాలట. అప్పుడే దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాదు, కనీసం రోజుకి రెండుసార్లు బ్రష్ చేయడం కూడా చాలా ముఖ్యం. అంతేకాకుండా, బ్రష్ చేసే సమయంలో మనం కామన్ గా చేస్తున్న పొరపాట్లు ఏంటో, వాటిని ఎలా సరి చేసుకోవాలో చూద్దాం...
 


1. మీరు తప్పు బ్రష్‌ను ఎంచుకుంటున్నారు...
చాలా మంది సరైన బ్రష్ ని ఎంచుకోవడంలో పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఎలాంటి బ్రష్ ని ఎంచుకోవాలో తెలియక ఏది పడితే అది కొనుగోలు చేస్తుంటారు. నోట్లోని అన్ని మూలల్లోకి వెళ్లగలిగే బ్రష్ ని ఎంచుకోవాలి. ఇది మాన్యువల్ అయినా, ఛార్జింగ్ బ్రష్ అయినా సరే, నోట్లో అన్ని మూలల్లోకి వెళ్లే వాటిని ఎంచుకోవాలి. అంతేకాకుండా,  బ్రష్  చాలా మృదువుగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే రఫ్ గా ఉంటే, నోటిలో చిగుళ్లకు గాయం అయ్యే అవకాశం ఉంది. 
 



2. దంతాలను గట్టిగా రుద్దడం..

చాలా మంది బ్రష్ చేయడం అంటే, దంతాలను గట్టిగా రుద్దడం లాంటివి చేస్తూ ఉంటారు. అలా గట్టిగా రుద్దడం వల్ల దంతాలు అరిగిపోతాయి. దంతాలపైన ఉండే పొర తొలగిపోతుంది. కాబట్టి, గట్టిగా రుద్దకుండా, మృదువుగా రుద్దుతూనే నోటిలోని అన్ని మూలలను శుభ్రపరచాలి. బాత్రూమ్ లోని టైల్ శుభ్రం చేసేటప్పుడు రుద్దినట్లుగా రుద్ద కూడదు.


3. ఎంత సమయం చేయాలి?
మీరు ప్రతిసారీ 2 నిమిషాల పాటు రోజుకు కనీసం రెండుసార్లు బ్రష్ చేయాలి. కానీ ఇతర పనుల కారణంగానో, సమయం లేకనో, మన బద్దకం కారణంగానో దీనిని విస్మరిస్తూ ఉంటాం. కానీ, ఆరోగ్యకరమైన దంతాలను పొందాలి అంటే,  రోజుకి, రెండు సార్లు బ్రష్ చేయడం ఉత్తమం.
 


4. బ్రష్ ఎలా చేయాలి..?

చాలా మంది బ్రష్ చేయడం అంటే, బ్రష్ పైన పేస్టు పెట్టుకొని ముందుకీ, వెనక్కి రుద్దడం అనుకుంటారు. కానీ అలా కాదు, బ్రష్ ని మన దంతాలపై, నోటిలో వృత్తాకారంలో రుద్దాలి. ఎలా పడితే అలా రుద్దితే, దంతాలు అరిగిపోతాయి. అలా కాకుండా వృత్తాకారంలో రుద్దాలి. అప్పుడు దంతాలు పాడవ్వకుండా ఉంటాయి.

5. మీరు గమ్ లైన్‌ను మరచిపోతారు.
మీ దంతాలు మీ చిగుళ్లను కలిసే చోట బ్యాక్టీరియా తరచుగా వ్యాపిస్తుంది. ఆ ప్రాంతాన్ని చాలా మిస్ అవుతున్నాం. కేవలం దంతాలపైనే ఫోకస్ పెడుతుంటారు. కానీ, గమ్ లైన్ ని మర్చిపోతూ ఉంటారు. కానీ, గమ్ లైన్ పై కూడా ఫోకస్ పెట్టాలి. గమ్ లైన్ ని కూడా శుభ్రం చేసుకోవాలి.

6.నాలుకను కూడా శుభ్రం చేసుకోవాలి..
చాలా మంది నోరు, దంతాలు శుభ్రం చేసుకోవడం అంటే,కేవలం దంతాలపై కూడా ఫోకస్ పెడుతుంటారు. కానీ, దంతాలతో పాటు నోరు కూడా శుభ్రం చేసుకాలి. నాలుకను కూడా శుభ్రం చేయాలి. అప్పుడే నోరు ఆరోగ్యంగా ఉంటుంది. భోజనం చేసిన ప్రతిసారీ, ఏదైనా ఆహారం తీసుకున్నా కూడా, నీటితో పుక్కిలిస్తూ ఉండాలి. 
 

Latest Videos

click me!