కూరలో ఉప్పు ఎక్కువైందా? అయితే ఇలా చేయండి వెంటనే తగ్గిపోతుంది!

వంటల్లో అన్ని సరిపడా వేస్తేనే రుచి బాగుంటుంది. ఎవరైనా ఇష్టంగా తింటారు. ఉప్పు, కారం ఏది ఎక్కువైనా కష్టమే. కారం ఉంటే అటు, ఇటో లాగించొచ్చు కానీ... ఉప్పు ఎక్కువైతే మాత్రం నోటికి అస్సలు రుచించదు.

Kitchen Hacks to Reduce Excess Salt in Food KVG

వంట రుచికి ఉప్పు ముఖ్యం. ఉప్పు తక్కువైనా, ఎక్కువైనా వంట బాగోదు. ఉప్పు తక్కువైతే సరిచేసుకోవచ్చు కానీ ఎక్కువైతే మాత్రం కష్టం. అయితే కొన్ని చిట్కాలతో ఉప్పు కషాన్ని ఈజీగా తగ్గించుకోవచ్చు.

Kitchen Hacks to Reduce Excess Salt in Food KVG
బంగాళాదుంప

వంటలో ఉప్పు ఎక్కువైతే, బంగాళాదుంప ముక్కలను వేయండి. బంగాళాదుంప ఉప్పును పీల్చుకుంటుంది. వంటలో వేసేటప్పుడు దీని తొక్క తీసేయాలి.


పిండి ఉండలు

ఉప్పు ఎక్కువగా ఉన్న వంటలో తగినన్ని పిండి ఉండలను చేసి వేయండి. ఉండలు ఉప్పును పీల్చుకుంటాయి. వంట వడ్డించే ముందు ఉండలను తీసివేయండి. పప్పు లేదా కూరలో ఉప్పు ఎక్కువైతే పిండి ఉండలను తినవచ్చు.

తాజా క్రీమ్

క్రీమ్ కూడా ఉప్పును తగ్గిస్తుంది. క్రీమ్ వంటకి రుచిని కూడా పెంచుతుంది. ఒక చెంచా పెరుగు వేసి ఐదు నిమిషాలు మరిగిస్తే కూడా ఉప్పు తగ్గుతుంది.

నిమ్మరసం

ఇండియన్, మొఘల్, చైనీస్ వంటల్లో నిమ్మరసం వేస్తే ఉప్పు తగ్గుతుంది. అన్నంలో కూడా నిమ్మరసం వేస్తే ఉప్పు తగ్గుతుంది.

Latest Videos

click me!