పోహా.. మన భాషలో చెప్పాలంటే అటుకులు. దీంతో చేసే టిఫిన్ వెరైటీ చాలామంది ఇష్టపడతారు. ముఖ్యంగా దీంట్లో క్యాలరీలు ఎక్కువగా ఉండకపోవడం వల్ల డైటింగ్ చేసేవారికి కూడా బాగుంటుంది. అయితే అటుకులు బియ్యంతో తయారవుతాయి కదా.. కీటో డైట్ చేసేవారికి ఎలా అంటే.. దానికీ దీన్ని తయారు చేసేవిధానంలో చిన్న చిన్న మార్పులు చేస్తే సరిపోతుంది.
చక్కటి పోషకాహారమైన పోహాలో క్యాబేజీ, కాలీఫ్లవర్ తరిగి వేసి, ఆలివ్ నూనెలో చేస్తే మీకు కావాల్సిన ప్రయోజనాలు అన్నీ అందుతాయి. ఆలివ్ నూనెలోని ప్రయోజనాలు, కాలీఫ్లవర్, క్యాబేజీలోని పోషకాలు, కొత్తిమీర, పల్లీలలోని సుగుణాలు మీ డైట్ కి మరింత సహకరిస్తాయి.
ఈ టిఫిన్ లేదా స్నాక్ ఐటమ్ ను 30 ని.ల్లో సులభంగా తయారుచేసుకోవచ్చు.
కీటో పోహా తయారీకి కావాల్సిన పదార్థాలు :1 కప్పు తురిమిన కాలీఫ్లవర్12 కప్పు తరిగిన ఉల్లిపాయ2 రెమ్మల కరివేపాకు14 టీస్పూన్ ఇంగువ2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం1 ఎండు మిరపకాయ14 కప్పు నీరు12 కప్పు క్యాబేజీ14 కప్పు వేయించిన పల్లీలు12 టీస్పూన్ ఆవాలు12 టీస్పూన్ పసుపు1 టేబుల్ స్పూన్ ఎక్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్రుచికి సరిపడా ఉప్పు1 టేబుల్ స్పూన్ కొత్తిమీర

కీటో పోహా తయారు చేసే విధానం..ముందుగా బాణలిలో ఆలివ్ ఆయిల్ వేసి వేడిచేయండి. దీంట్లో ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి చిటపటలాడేదాకా ఉంచండి. ఆ తరువాత ఇందులో తరిగిపెట్టుకున్న ఉల్లిపాయలు వేసి 1,2 నిముషాలు వేయించండి.
ఇప్పుడు పసుపు వేసి కలపాలి. దీంట్లో తరిగిన కాలీఫ్లవర్ వేసి, ఉప్పు, కొన్ని నీళ్లు పోసి బాగా ఉడకనివ్వాలి. ఆ తరువాత దీనికి సన్నగా తరిగిన క్యాబేజీ వేసి కాసేపు ఉంచాలి.
ఇప్పుడు పసుపు వేసి కలపాలి. దీంట్లో తరిగిన కాలీఫ్లవర్ వేసి, ఉప్పు, కొన్ని నీళ్లు పోసి బాగా ఉడకనివ్వాలి. ఆ తరువాత దీనికి సన్నగా తరిగిన క్యాబేజీ వేసి కాసేపు ఉంచాలి.
తరువాత దీంట్లో వేయించిన పల్లీలు వేసి దీనికి తడిపిన పోహా కలపండి. బాగా వేగిన తరువాత, నిమ్మరసం వేసి మళ్లీ కలపండి.
ఇప్పుడు దీనికి తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయడమే.
ఇప్పుడు దీనికి తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయడమే.