నల్ల నువ్వులు..
నువ్వులలో ప్రధానంగా తెలుపు, నలుపు అని రెండు రకాలు ఉంటాయి. నల్ల నువ్వులు శరీరానికి వేడిని ఇస్తాయి, అందుకే చలికాలంలో వీటిని ఎక్కువగా ఆహారంలో భాగం చేసుకుంటారు. తెల్ల నువ్వులతో పోలిస్తే నల్ల నువ్వులలో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ప్రోటీన్, కాల్షియం, మెగ్నీషియం, కాపర్, మాంగనీస్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఇందులో సమృద్ధిగా ఉంటాయి. అందుకే శీతాకాలంలో బలం కోసం నల్ల నువ్వుల లడ్డూలు తింటుంటారు.
రోజూవారీ వంటల్లో నల్ల నువ్వుల వాడకం:
మీరు తయారు చేసుకునే వెజిటబుల్ సలాడ్లపై కాస్త నల్ల నువ్వులను చల్లుకోండి. ఇది సలాడ్ పోషక విలువలను పెంచడమే కాకుండా, తినేటప్పుడు మంచి క్రంచీ రుచిని ఇస్తుంది. మఫిన్లు, కుకీలు లేదా బిస్కెట్లు బేక్ చేసేటప్పుడు పైన గార్నిష్ కోసం వీటిని వాడవచ్చు. అలాగే నాన్ , కుల్చా లేదా పరాటాలపై నల్ల నువ్వులు అద్ది కాల్చుకుంటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.
ఈ రెండింటికీ తేడా ఎలా గుర్తించాలి..?
కలోంజి గింజలు కాస్త త్రిభుజాకారంలో, గరుకుగా ఉండి ఘాటైన వాసన (ఉల్లిపాయ, మిరియాల కలయికలా) కలిగి ఉంటాయి. నల్ల నువ్వులు మాత్రం నునుపుగా, చదునుగా ఉండి నమిలితే కమ్మని నూనె రుచిని ఇస్తాయి. ఇకపై వంటగదిలో వీటిని చూసినప్పుడు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా వాడేయండి.