Railway Station: రైల్వే స్టేషన్ పేరు పక్కన జంక్షన్, సెంట్రల్, టర్మినల్ అని ఎందుకు ఉంటుంది? వీటి అసలు అర్థం ఏంటి?

Published : Nov 12, 2026, 10:51 AM IST

Railway Station: ప్రతి రైల్వే స్టేషన్ కీ పేరు ఉంటుంది. ఆ పేరు వెనక చాలా కొన్ని పదాలు రాసి ఉంటాయి. అలా ఎందుకు ఉంటుంది? ఆ పదాల వెనక ఉన్న అసలు అర్థం ఏంటో తెలుసా?

PREV
13
పేరు వెనక అర్థం...

మనలో చాలా మంది రెగ్యులర్ గా రైలు ప్రయాణాలు చేస్తూనే ఉంటారు. మనం రైలు ప్రయాణం చేసేటప్పుడు ఎన్నో స్టేషన్లు దాటుకుంటూ వెళ్తూ ఉంటాం. అయితే, కొన్నిస్టేషన్ పేర్ల పక్కన ‘జంక్షన్’ అని, మరి కొన్నింటి పక్కన ‘ సెంట్రల్’, మరి కొన్నింటి పక్కన‘ టర్మినల్’, ‘కాంట్’ , ‘ హాల్ట్’ అని రాసి ఉండటాన్ని మీరు గమనించే ఉంటారు. కేవలం ఊరిపేరు మాత్రమే కాకుండా, పక్కన ఇలాంటి పదాలు ఎందుకు జోడిస్తారు? దీని వెనక కారణం ఏంటో తెలుసా? ఆ పేర్ల వెనక ఉన్న రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం...

23
1.జంక్షన్...

ఒక రైల్వే స్టేషన్ పేరు పక్కన జంక్షన్ అని రాసి ఉంటే... ఆ స్టేషన్ నుంచి కనీసం మూడు వేర్వేరు దిశల్లో రైలు మార్గాలు ఉన్నాయి అని అర్థం. అంటే, ఒక మార్గం ద్వారా వచ్చిన రైలు, అక్కడి నుంచి రెండు లేదా అంతకంటే ఎక్కువ వేర్వేరు మార్గాల్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు విజయవాడ జంక్షన్, కాజీపేట జంక్షన్.

2.సెంట్రల్...

ఒక నగరంలో చాలా రైల్వే స్టేషన్లు ఉన్నప్పుడు, అందులో అత్యంత పాతది, అత్యధిక రద్దీగా ఉండే ప్రధాన స్టేషన్ పేరు పక్కన 'సెంట్రల్' అని పెడతారు. సాధారణంగా ఆ నగరంలోని ప్రధాన రవాణా కార్యకలాపాలన్నీ ఇక్కడి నుంచే జరుగుతాయి. అయితే, ప్రతి పెద్ద నగరంలోనూ సెంట్రల్ స్టేషన్ ఉండాలనే నియమమేమీ లేదు.(ఉదాహరణకు: చెన్నై సెంట్రల్, ముంబై సెంట్రల్, కాన్పూర్ సెంట్రల్)

3. టర్మినల్ / టెర్మినస్ (Terminal / Terminus) ఒక రైల్వే స్టేషన్ పేరు పక్కన 'టర్మినల్' లేదా 'టెర్మినస్' అని రాసి ఉంటే, ఆ రూట్‌లో రైలు ప్రయాణానికి అదే చివరి స్టేషన్ అని అర్థం. అంటే, రైలు ఆ స్టేషన్‌కు చేరుకున్న తర్వాత ఇక ముందుకు వెళ్లడానికి పట్టాలు ఉండవు. ఆ రైలు మళ్ళీ వచ్చిన దారిలోనే వెనక్కి తిరిగి వెళ్లాల్సి ఉంటుంది.ఉదాహరణకు: ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, లోకమాన్య తిలక్ టెర్మినస్

33
4. కాంట్ / కంటోన్మెంట్

ఒకవేళ స్టేషన్ పేరు పక్కన 'కాంట్' (Cantt) అని ఉంటే, ఆ స్టేషన్ ఆర్మీ లేదా మిలిటరీ ఏరియాకు దగ్గరగా ఉందని అర్థం. బ్రిటిష్ కాలం నుంచే సైనిక స్థావరాలు ఉన్న ప్రాంతాల్లోని స్టేషన్లకు ఈ పేరును ఉపయోగిస్తున్నారు.ఉదాహరణకు: సికింద్రాబాద్ కంటోన్మెంట్, ఆగ్రా కాంట్, అంబాలా కాంట్

5. హాల్ట్ ఏదైనా స్టేషన్ పేరు పక్కన 'హాల్ట్' అని రాసి ఉంటే, అది చాలా చిన్న రైల్వే స్టేషన్ అని అర్థం. ఇక్కడ కేవలం లోకల్ లేదా ప్యాసింజర్ రైళ్లు మాత్రమే కొద్దిసేపు ఆగుతాయి. ఎక్స్‌ప్రెస్ లేదా సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇక్కడ స్టాప్ ఉండదు. ఇక్కడ టికెట్ కౌంటర్లు కూడా చాలా పరిమితంగా ఉంటాయి.

ఇకపై మీరు రైలు ప్రయాణం చేసేటప్పుడు కిటికీలోంచి స్టేషన్ బోర్డు వైపు చూస్తే.. ఆ పేరు పక్కన ఉన్న పదాన్ని బట్టి అది ఎలాంటి స్టేషనో ఇట్టే కనిపెట్టేయవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories