ఈ నూనె రెండు చుక్కలు చాలు..మీలో వచ్చే మార్పులు ఇవే..!

First Published | Nov 12, 2024, 10:29 AM IST

కలోంజీ గింజలను నల్ల జీలకర్ర అని కూడా పిలుస్తారు. ఈ గింజల నూనె మన శరీర ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. చాల ా మంది ఈ గింజలను మరిగించి నీటిని తాగుతూ ఉంటారు. అయితే నీరు మాత్రమే కాదు.. వీటి నూనె కూడా మనకు చాలా ప్రయోజనాలు అందిస్తాయి. మరి, ఆ ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం...

ఈ రోజుల్లో అందరివీ గజిబిజీ బతుకులు అనే చెప్పొచ్చు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఉరుకుల పరుగుల మధ్య ఈ జీవితం సాగిపోతోంది. వీటి కారణంగా మన ఆహారపు అలవాట్లు కూడా మారిపోతున్నాయి. ఫాస్ట్ ఫుడ్ జీవితం లో ఒక భాగంగా మారిపోయింది. ఈ ఆహారపు అలవాట్ల కారణంగానే మనకు చాలా రకాల వ్యాధులు వస్తున్నాయి. అయితే.. ఆ సమస్యలను తగ్గించడానికి మనకు కలోంజీ గింజలు చాలా బాగా సహాయపడతాయి. ఎందుకంటే ఈ గింజల్లో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సోడియం, కాల్షియం, ఐరన్ వంటి ఖనిజాలు ఎక్కువగా ఉండే ఈ కలోంజీ గింజల్లో చాల ారకాల వ్యాధులను నయం చేసే గుణాలు పుష్కలంగా ఉన్నాయి.

ఈ గింజల్లో కార్బో హైడ్రేట్స్, పొటాషియం, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. చాలా రకాల విటమిన్లు ఉండే ఈ నూనెలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కూడా ఉన్నాయి. ఇందులో ఉండే బాక్టీరియా వ్యతిరేక, క్రిమిసింహారక గుణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.


క్యాన్సర్ నివారణ: 

కలోంజీ నూనె క్యాన్సర్ కణాల పెరుగుదలను అరికడుతుంది. ఈ నూనెను తాగడం వల్ల క్యాన్సర్ కణాల పెరుగుదల ఆగుతుంది. క్యాన్సర్ ఉన్నవారిలో ఆరోగ్యకరమైన కణాలను ఈ నూనె దెబ్బతినకుండా కాపాడుతుంది. ఒక గ్లాసు ద్రాక్ష రసంలో అర టీస్పూన్ కలోంజీ నూనె కలిపి రోజుకి 3 సార్లు తాగడం మంచిది. 

దగ్గు & ఆస్తమా:  

కొంతమందికి దీర్ఘకాలిక దగ్గు సమస్య ఉంటుంది. వారికి, ఆస్తమాతో బాధపడేవారికి కలోంజీ నూనె ఉపశమనం కలిగిస్తుంది. వేడి కలోంజీ నూనెతో ఛాతీ, వీపు భాగాలపై మసాజ్ చేయాలి. ఇది ఊపిరితిత్తుల్లోని ఇన్ఫెక్షన్ ని తగ్గించి, మంచి శ్వాస కోసం దోహదపడుతుంది. 

డయాబెటిస్ నియంత్రణ: 

కలోంజీ నూనె రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. కలోంజీని పాలు లేని బ్లాక్ టీలో కలిపి తాగవచ్చు. ఆవ గింజలు, కలోంజీ, ఎండు దానిమ్మ తొక్కలను కలిపి పొడి చేసి, దానితో టీ చేసుకుని తాగవచ్చు. 

కలోంజీ నూనె ప్రయోజనాలు

కిడ్నీ స్టోన్స్: 

కిడ్నీ స్టోన్స్ చాలా మందికి ఉండే సాధారణ సమస్యగా మారింది. ఈ సమస్య ఉన్నవారు కలోంజీ పొడిని తేనెతో కలిపి తింటే మంచిది. ఈ మిశ్రమానికి రెండు టీస్పూన్ల కలోంజీ నూనె, గోరువెచ్చని నీళ్లు కలిపి రోజూ ఉదయం టిఫిన్ కి ముందు తాగాలి. 

గుండె జబ్బులు & రక్తపోటు: 

వివిధ కారణాల వల్ల వచ్చే గుండె జబ్బులు, రక్తపోటు సమస్యలను కలోంజీ నూనె తగ్గిస్తుంది. ఈ నూనె గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. టీ లేదా కాఫీ లేదా సూప్ వంటి ఏదైనా వేడి పానీయంలో ఒక టీస్పూన్ కలోంజీ నూనె కలపడం మంచిది. ఈ నూనెతో శరీరానికి మసాజ్ చేస్తే రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీనివల్ల శరీరం తేలికగా అనిపిస్తుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. రక్తపోటు కూడా తగ్గే అవకాశం ఉంది.

Latest Videos

click me!