అంతే కాదు తమ స్ధోమతకు తగ్గట్టు కానుకలు కూడా సమర్పించుకుంటారు. తిరుమల తిరుపతి లాంటి పెద్ద పెద్ద దేవాలయాలలో దేవడికి బంగారు కిరీటాలు చేయిస్తుంటారు. నగలు చేయిస్తారు, పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. లక్షలకు లక్షలు హుండీలో వేస్తుంటారు. తిరుపతి హుండీలో రోజు పేదా ధనిక అందరు వేసే కానుకలు కోటి నుంచి ఐదు కోట్ల వరకూ ఉంటుంటాయి.
అలా చిన్నా పెద్ద గుడులలో హుండీలలో అంతో ఇంతో కానుకలు వేయడం సాధారణం. అయితే హుండీలో కానుకలు వేయడానికి కూడా ఓ లెక్క ఉందట. ఈ విషయం మీకు తెలుసా..? ఏదేవుడి గుడిలో ఎంత కానుక వేస్తే మంచి జరుగుతుందో తెలుసా..? ఈ విషయంలో పెద్దలు, స్వాములు ఏం చెపుతున్నారు. ..? దీనికి సబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ విషయం ఏంటంటే..?