ఏంటీ జాయిన్ మై వెడ్డింగ్..
భారతీయ వివాహ వేడుకల అనుభవాలను విదేశీయులతో పంచుకునేందుకు రూపొందించిన ఒక వేదికే ఈ జాయిన్ మై వెడ్డింగ్. ఈ వేదిక ద్వారా, ప్రపంచం నలుమూలల నుంచి భారత్‌కు వచ్చే టూరిస్టులు వివాహ వేడుకల్లో పాల్గొని, మన సంస్కృతి, ఆచారాలను నేరుగా చూస్తారు. భారతీయ వివాహాల్లో ఉండే ఆచారాలు, సంప్రదాయాలు, సంగీతం, నృత్యాల వంటివి విదేశీ అతిథులను ఎంతగానో ఆకర్షిస్తాయి.
అలాగే భారతీయ వంటకాలు, పెళ్లిలో చేసే వెరైటీ ఫుడ్‌ను ఆస్వాదించేందుకు మొగ్గు చూపుతుంటారు. వివాహాం చేసుకునే వారు లేదా వారి కుటుంబ సభ్యుల వివాహానికి సంబంధించిన వివరాలను జాయిన్ మై వెడ్డింగ్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్న టూరిస్టులు ఆ వేడుకలకు టికెట్లు బుక్ చేసుకుంటారు.