Cooking Tips: కూర మరీ నీళ్లలా పలచగా మారిందా? నిమిషాల్లో చిక్కగా,రుచిగా మార్చేయచ్చు..!

Published : Aug 04, 2026, 08:53 AM IST

Cooking Tips: చికెన్, మటన్, లేదా ఏదైనా వెజ్ కర్రీ వండుతున్నప్పుడు మరీ పలచగా మారిందా? రుచి చెడిపోయిందని ఫీలౌతున్నారా? నిమిషాల్లో కూరను రుచిగా మార్చేయచ్చు.

PREV
14
Cooking Tips

వంట చేస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నా.. కొన్ని సార్లు కూర, సాంబార్, సూప్ లేదా ఏవైనా గ్రేవీ కర్రీల్లో అనుకోకుండా నీళ్లు ఎక్కువ అయిపోతూ ఉంటాయి. దీని వల్ల కూర రుచి మారిపోతుంది. కూర పాడైందని పారేయకుండా.. కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అయితే.. కూరను మరింత రుచిగా మళ్లీ మార్చుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం...

24
ఇంట్లో పదార్థాలతో హోటల్ స్టైల్ గ్రేవీ తయారు చేసే చిట్కాలు..

1. కార్న్ ఫ్లోర్ లేదా శనగపిండి వాడండి

గ్రేవీని త్వరగా చిక్కగా చేయడానికి ఇది అత్యంత సులభమైన మార్గం.

ఒక చిన్న గిన్నెలో 2 టీ స్పూన్ల కార్న్ ఫ్లోర్ లేదా శనగపిండి తీసుకోండి. అందులో కొద్దిగా చల్లటి నీరు వేసి ఉండలు లేకుండా బాగా కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మరుగుతున్న గ్రేవీలో నెమ్మదిగా పోస్తూ కలపండి.

2–3 నిమిషాల్లోనే గ్రేవీ చిక్కబడుతుంది.

గమనిక: పిండిని నేరుగా గ్రేవీలో వేయకండి. అలా చేస్తే ఉండలు ఏర్పడే అవకాశం ఉంటుంది.

34
2. జీడిపప్పు పేస్ట్ కలపండి

రెస్టారెంట్‌లలో క్రీమీ గ్రేవీ కోసం ఎక్కువగా జీడిపప్పు పేస్ట్‌ను ఉపయోగిస్తారు.

జీడిపప్పును 20 నిమిషాలు నానబెట్టి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ పేస్ట్‌ను గ్రేవీలో కలిపి 5 నిమిషాలు ఉడికిస్తే గ్రేవీ చిక్కగా మారడమే కాకుండా రుచి కూడా పెరుగుతుంది.

ప్రత్యేకంగా పనీర్, కోఫ్తా, బటర్ మసాలా వంటి వంటకాలకు ఇది బాగా సరిపోతుంది.

గసగసాల పేస్టు..

గసగసాలను కొద్దిసేపు నానబెట్టి పేస్ట్ చేసి కలిపినా గ్రేవీ సహజంగా చిక్కగా మారుతుంది. దీనివల్ల గ్రేవీకి మృదువైన టెక్స్చర్ కూడా వస్తుంది.

తాజా క్రీమ్ లేదా ఫ్రెష్ క్రీమ్

రిచ్, క్రీమీ గ్రేవీ కావాలంటే చివర్లో ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ కలపండి.

ఇది ముఖ్యంగా పనీర్ కర్రీలు బటర్ చికెన్ మలై వంటకాలకు బాగా సరిపోతుంది.

44
ఉడికించిన బంగాళాదుంప

ఉడికించిన బంగాళాదుంపను మెత్తగా చేసి గ్రేవీలో కలిపితే అది సహజంగా చికగా మారుతుంది.

ఇలా చేయడం వల్ల రుచి పెద్దగా మారదు. గ్రేవీకి మంచి టెక్చర్ వస్తుంది. 

ఉల్లిపాయ లేదా టమాటో పేస్ట్

ఉల్లిపాయ లేదా టమాటోను బాగా వేయించి పేస్ట్ చేసి కలిపితే కూడా గ్రేవీ చిక్కగా మారుతుంది..

అయితే ఒక విషయం గుర్తుంచుకోండి...పచ్చి వాసన పూర్తిగా పోయే వరకు బాగా వేయించాలి. లేదంటే గ్రేవీ రుచి మారిపోతుంది.

ఏ గ్రేవీకి ఏ పద్ధతి బాగా పనిచేస్తుంది? 

పనీర్, మలై, బటర్ మసాలా – జీడిపప్పు పేస్ట్ లేదా ఫ్రెష్ క్రీమ్ 

చికెన్, మటన్ గ్రేవీలు – మూత లేకుండా మరిగించడం లేదా ఉల్లిపాయ పేస్ట్ 

వెజిటబుల్ కర్రీలు – కార్న్ ఫ్లోర్ లేదా బంగాళాదుంప సూప్స్  వాడితే సరిపోతుంది.

గ్రేవీ మరీ ఎక్కువగా చిక్కగా మారితే కొద్దిగా వేడి నీరు వేసి సర్దుబాటు చేయండి.

Read more Photos on
click me!

Recommended Stories