రోజూ తలస్నానం చేస్తే ఏమౌతుందో తెలుసా?

First Published | Sep 25, 2024, 11:25 AM IST

మన ముఖమే కాదు.. చర్మం, జుట్టు కూడా మనల్ని అందంగా మార్చడానికి సహాయపడుతుంది. అందుకే చర్మాన్నే కాదు జుట్టును కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇకపోతే హెయిర్ కేర్ కు సంబంధించి చాలా మందికి రోజూ తలస్నానం చేయాలా? వద్దా? అని డౌట్ వస్తుంటుంది. మరి దీనిపై నిపుణులు ఏమంటున్నారంటే? 

అందంగా కనిపించాలని జనాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఇకపోతే  అందం విషయానికొస్తే జనాలు ముందుగా చేసే పని ముఖం, స్కిన్ ను మెరుగుపరిచే చిట్కాలను ఫాలో అవుతుంటారు. అలాగే జుట్టు విషయంలో కూడా ఎంతో జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే మనల్ని అందంగా కనిపించేలా చేయడంలో ఇది కూడా కీలక పాత్ర పోషిస్తుంది. 
 

అందంగా కనిపించాలని  చాలా మంది అమ్మాయిలు, అబ్బాయిలు ప్రతిరోజూ తలస్నానం చేస్తుంటారు. నూనె అస్సలు పెట్టరు. కానీ ఇది మీ జుట్టును దెబ్బతీస్తుంది. కానీ ఈ విషయం చాలా మందికి తెలియదు. అసలు తలస్నానం రోజూ చేస్తే ఏమౌతేంది? ఎన్ని రోజులకోసారి తలస్నానం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 



రోజూ తలస్నానం చేయొచ్చా?

పనులకు, కాలేజీలకు, ఆఫీలకు వెళ్లేవారు చాలా మంది ప్రతిరోజూ షాంపూతో తలస్నానం చేస్తుంటారు. కానీ దీనివల్ల మీ జుట్టుకు ఉన్న సహజ నూనెలు తొలగిపోతాయి. దీనివల్ల మీ వెంట్రుకలు పొడిబారుతాయి. 

అందుకే మీరు ప్రతిరోజూ తలస్నానం చేయాలనుకుంటే గనుక మితమైన సల్ఫేట్ లేని షాంపూను ఉపయోగించండి. ఇకపోతే వేడి వేడి నీళ్లతో తలస్నానం చేయకూడదు. ఇది మీ జుట్టును దెబ్బతీస్తుంది. కాబట్టి వేడి నీళ్లకు బదులుగా గోరువెచ్చని నీళ్లను ఉపయోగించండి. అలాగే మీ నెత్తికి షాంపూను పెట్టి కాసేపు మసాజ్ చేయండి. దీంతో నెత్తిమీదున్న అదనపు నూనె, జుట్టుకు అంటుకున్న మురికి తొలగిపోతుంది. 
 

ఇకపోతే ఎట్టి పరిస్థితిలో జుట్టు చివర్లను గట్టి గట్టిగా రుద్దకూడదు. మీ జుట్టు ఆరడానికి డ్రైయ్యర్ ను వాడకండి. జుట్టు సహజంగా ఆలేలా చూడండి. మీ జుట్టు హెల్తీగా ఉండాలంటే రోజువారీ జుట్టు సంరక్షణ చాలా అవసరం. అలాగే జుట్టుకు నూనె పెట్టాలి. అప్పుడే మీ జుట్టుకు మంచి పోషణ అందుతుంది. జిడ్డుగా మారితే తప్ప రోజూ తలస్నానం చేయకపోవడమే మంచిది.
 

రోజూ తలస్నానం చేయడం వల్ల వచ్చే సమస్యలు

ప్రతిరోజూ షాంపూతో తలస్నానం చేయడం వల్ల మీ జుట్టు స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఇది కాలక్రమేనా మీ జుట్టును పొడిబారేలా చేస్తుంది. అలాగే చిక్కులు ఎక్కువగా పడుతుంది. ముఖ్యంగా జుట్టు చివర్లో. అంతేకాదు మీ జుట్టు జీవం లేనట్టుగా, నూనె లేనట్టుగా కనిపిస్తుంది.

అంతేకాకుండా.. జుట్టును రోజూ వాష్ చేయడం వల్ల వెంట్రుకలు దాని సహజ రంగును, ప్రకాశాన్ని కోల్పోతాయి. ఇలాంటి పరిస్థితిలో  మంచి కండిషనింగ్ తో మీ జుట్టును తిరిగి అందంగా చేయొచ్చు. 

Hair wash

వారానికి ఎన్నిసార్లు తలస్నానం చేయాలి?

మీకు ఎలాంటి జుట్టు ఉన్నా.. వారానికి రెండు నుంచి మూడు సార్లు తలస్నానం చేయడం మంచిదంటారు. ఇలా చేయడం వల్ల జుట్టులో నేచురల్ ఆయిల్స్ ఉంటాయి. దీనివల్ల మీ జుట్టు పొడిబారే అవకాశం ఉండదు.

అలాగే జిడ్డుగా కూడా మారదు. పొడిజుట్టు లేదా కర్లీ జుట్టు జుట్టు తేమను నిలుపుకోవటానికి తక్కువగా తరచుగా శుభ్రపరచడం ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే ఆయిలీ జుట్టును రోజూ వాష్ చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. 
 

hair wash

తలస్నానం చేయడానికి సరైన మార్గమేంటి? 

జుట్టును సరిగ్గా వాష్ చేయాలంటే గోరువెచ్చని నీళ్లతో తలస్నానం చేయండి. తర్వాత కొద్దిగా షాంపూను తలకు పెట్టి కాసేపు మసాజ్ చేయండి. జుట్టును బాగా కడిగిన తర్వాత జుట్టును చివర్ల వరకు బాగా కండీషన్ చేయాలి.  ఇకపోతే జుట్టు తేమను నిలుపుకోవాలంటే జుట్టును చల్లటి నీటితో కడగాలి. వేడి నీళ్లను అస్సలు ఉపయోగించకూడదు. లేదా గట్టిగా రుద్దకూడదు. 
 

Latest Videos

click me!