Bird Flu: బర్డ్‌ఫ్లూ నేపథ్యంలో చికెన్‌ తినాలా, వద్దా.? తింటే ఎలా తినాలి.?

Published : Feb 13, 2025, 12:35 PM IST

ప్రస్తుతం చికెన్‌ పేరు వింటేనే భయపడే పరిస్థితి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి జిల్లాల్లో బర్డ్ ఫ్లూ సోకి లక్షలాది కోళ్లు చనిపోతున్న నేపథ్యంలో చికెన్ తినాలంటే ఆలోచిస్తున్నారు. దీంతో కోళ్ల ధరలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. ఇంతకీ కోళ్లను తింటే నిజంగానే అంత ప్రమాదం పొంచి ఉందా.? కోళ్లను ఎలా తీసుకుంటే ఆరోగ్యంపై ప్రభావం పడదు లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..   

PREV
13
 Bird Flu: బర్డ్‌ఫ్లూ నేపథ్యంలో చికెన్‌ తినాలా, వద్దా.? తింటే ఎలా తినాలి.?

బర్డ్‌ఫ్లూ నేపథ్యంలో సోషల్‌ మీడియా వేదికగా ఓ రేంజ్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి. చికెన్‌ తింటే అంతే సంగతులు అంటూ పోస్టులు చేస్తున్నారు. దీంతో చికెన్‌ ధరలు అమాంతం పడిపోయాయి. కొన్ని చోట్ల ఏకంగా కిలో చికెన్‌ రూ. 50కే విక్రయిస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలో చికెన్‌ తినాలా వద్దా అనే సందేహం సర్వసాధారణం. ఇతర ప్రాంతాల్లో ప్రజలు కూడా చికెన్‌ తినడానికి జంకుతున్నారు. అయితే చికెన్‌ను శుభ్రం చేసే విధానంలో, దానిని వండే విధానంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అదేలాగంటే.. 
 

23

ముందుగా చికెన్ కొనండి. చేతికి గ్లోవ్స్ వేసుకొని దాన్ని కట్ చేయండి. గ్లోవ్స్ తోనే చికెన్ ముక్కలు తీసి గిన్నె లేదా పెనం పై పెట్టి ఉడికించండి ( లేదా ఫ్రై ) . మీరు చికెన్ ఎలా చేసేవారో అలాగే - తేడా ఏమీ లేదు. గ్లోవ్స్ లేక పొతే చికెన్ కట్ చేసాక చేతులను సబ్బు తో బాగా శుభ్రంగా కడుక్కోండి. తేడా ఒక్కటే పచ్చి చికెన్ లో వైరస్ ఉందనుకొని చేతులు శుభ్రం చేసుకోవడమే. నూనె లేదా నీటి వేడికి ఎలాగూ వైరస్ చస్తుంది. చేయాల్సిందల్లా ఒక్కటే. చికెన్ కట్ చేసిన చేతులతో మరో ఆహారపదార్థం ముట్టుకోక పోవడం.
 

33
Chicken

సబ్బు నీటితో చేతులు కడుక్కొంటే చేతుల్లోని వైరస్ చస్తుంది. ఉడికించిన వేడికి పెనంలోని చికెన్  లో వైరస్ చస్తుంది. అజ్ఞానం తో “ వామ్మో “ అని బూటకపు ప్రచారం చేశారు. దెబ్బకు చికెన్ రేట్లు పడిపోయాయి. చికెన్ తినడానికి ఇదే మంచి సమయం. (చికెన్ కట్ చేస్తున్నప్పుడు చేతితో నోటిని ముక్కును కళ్ళను తాకొద్దు. వెంటనే సబ్బుతో శుభ్రం చేసుకోండి. గ్లోవ్స్ ను ఉపయోగిస్తే దాన్ని చెత్తబుట్టలో పడేయండి. గ్లోవ్స్ వాడినా చేతులో సబ్బుతో కడుక్కోండి. అప్పటిదాకా ఇతర ఆహార పదార్థాలు తాకకండి.) అమర్ నాథ్ వాసిరెడ్డి ఫేస్ బుక్ పోస్ట్ లింక్ కోసం క్లిక్ చేయండి. 

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారంగానే భావించాలి. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం. 
 

click me!

Recommended Stories