Elder Daughter:ఇంట్లో పెద్ద కూతురు ఎలా ఉంటుందో తెలుసా?

Published : Feb 13, 2025, 11:11 AM ISTUpdated : Feb 13, 2025, 12:40 PM IST

మొదటి బిడ్డ ఆడపిల్లగా పుడితే... ఆ ఇంటికి రెండో అమ్మ దొరికినట్లే. అంతేకాదు... ఇంట్లో పెద్ద కూతురు ఉంటే ఎలా ఉంటుందో, వారిలో ఉండే స్పెషల్ క్వాలిటీస్ ఏంటో తెలుసుకుందాం...

PREV
15
Elder Daughter:ఇంట్లో పెద్ద కూతురు  ఎలా ఉంటుందో తెలుసా?

ఆడపిల్ల ఇంట్లో ఉంటే కలిగే సంతోషం అంతా ఇంతా కాదు. అందులోనే మొదటి సంతానం ఆడపిల్ల పుడితే.. సాక్షాత్తు లక్ష్మీదేవి పుట్టిందనే అందరూ అనుకుంటారు. మొదటి బిడ్డ ఆడపిల్లగా పుడితే... ఆ ఇంటికి రెండో అమ్మ దొరికినట్లే. అంతేకాదు... ఇంట్లో పెద్ద కూతురు ఉంటే ఎలా ఉంటుందో, వారిలో ఉండే స్పెషల్ క్వాలిటీస్ ఏంటో తెలుసుకుందాం...

25

1.బాధ్యత, ప్రేమ..
ఇంట్లో పెద్ద కూతురు కుటుంబంలో కీలక పాత్ర పోషిస్తుంది. బాధ్యతగా ఉంటారు. కుటుంబానికి బలాన్ని ఇస్తారు. ఇంటికి సంరక్షణగా నిలుస్తారు. సహజంగానే పెద్ద కూతురికి లీడర్ షిప్ క్వాలిటీలు ఉంటాయి. తాను మంచి మార్గంలో వెళ్లడంతోపాటు.. తన తోడపుట్టినవారికి మార్గనిర్దేశం చేస్తారు. తల్లిదదండ్రుల తర్వాత.. తమ తోడపుట్టిన వారిపై అంతటి ప్రేమ ఆమె మాత్రమే చూపించగలదు. ఆదర్శంగా నిలుస్తారు.

35

2.రక్షణ...
తన తోబుట్టువులకు రక్షణ కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. వారు ఏవైనా చిన్న చిన్న తప్పులు చేసినా, వాటిని సరిదిద్దే ప్రయత్నం చేస్తారు. పేరెంట్స్ తో తిట్లుపడకుండా కాపాడటంలో ముందుంటారు. వారి కోసం అండగా నిలపడతారు. వారికి వచ్చే ఇబ్బందులు, కష్టాలు తీర్చడంలో ముందుంటారు.

45


3.చిన్న తనం నుంచే కుటుంబానికి అండగా ఎలా నిలపడాలి, కుటుంబంలో సమస్యలను అర్థం చేసుకోవడంలో ముందుంటారు. తన తోడబుట్టిన వారి కోసం తన కోరికలను త్యాగం చేయడంలోనూ ముందుంటుంది.  కుటుంబ సవాళ్లను తన సవాళ్లుగా భావిస్తుంది. ఆమె ఆలోచనలు కూడా చాలా మెచ్యూర్డ్ గా ఉంటాయి. కన్నవాళ్లను ఇబ్బంది పెట్టకుండా.. అందరికీ నచ్చేలా  నిర్ణయాలు తీసుకోవాలని అనుకుంటారు.
 

55

త్యాగం..
దాదాపు ప్రతి ఇంట్లో మొదటి కుమార్తె  కుటుంబం కోసం తన సంతోషాన్ని త్యాగం చేయడంలో ముందుంటారు. తన తమ్ముడు, చెల్లెలి కోసం  తనకు నచ్చినవి వదిలేసుకోవడంలోనూ ముందుంటారు. ఇలాంటి త్యాగం ఇంట్లో కొడుకు, చిన్న కూతుళ్లు చేయడానికి ముందుకు రారు. ఆ త్యాగం పెద్ద కుమార్తె మాత్రమే చేయగలదు. అంతేకాదు.. కష్టపడి పని చేస్తారు. క్రమశిక్షణతో ఉంటారు. ఎవరికైనా  నచ్చేస్తారు. 
 

click me!

Recommended Stories