సింహాలు, పులులు కాదు.. మనుషులకు అత్యంత ప్రమాదకరమైన జీవులు ఇవే..!

First Published | Aug 31, 2024, 3:48 PM IST

మనకు ప్రమాదం చేసే డేంజర్ జీవి ఏదంటే.. టక్కున చెప్పే మాట పులి, పాము, మొసళి వంటి పేర్లను చెప్పేస్తుంటాం. కానీ వీటికంటే డేంజర్ జీవులు ఈ భూమిపై ఉన్నాయి. అవేంటంటే? 
 

భూమిపై అత్యంత ప్రమాదకరమైన జీవులు ఏవంటే.. మనం వెంటనే అడవి సింహాలు, విషపూరితమైన పాములు, సొరచేపలు వంటివి చెప్పేస్తాం. నిజానికి ఈ జీవులను చాలా సినిమాల్లో కూడా భయంకరంగా చూపిస్తుంటారు. అందుకే ఇవే మనుషులకు ప్రమాదకరమైన అనుకుంటారు. కానీ మనుషులకు వీటికంటే ఎక్కువ హాని చేసే జీవులు కొన్ని ఉన్నాయి. అలాగంటే ఇవెంత పెద్ద పెద్ద జీవులో అనిపించొచ్చు. కానీ ఇవి చాలా చిన్న సైజులో ఉంటాయి. కానీ మనిషి ప్రాణాలను  ఈజీగా తీసేయగలవు. అవేంటో ఓ లుక్కేద్దాం పదండి.
 

దోమలు

దోమలు మనుషులకు ప్రమాదకరమైనవా? అని ఆశ్చర్యపోకండి. ఈ లీస్ట్ లో దోమలే ఫస్ట్ ప్లేస్ ఉంటాయి. ఈ భూమ్మీద మరే ఇతర ప్రాణి కంటే  దోమలే ఎక్కువ మనుషుల మరణాలకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. దోమల వల్ల డెంగ్యూ జ్వరం, మలేరియా, జికా వైరస్, ఎల్లో ఫీవర్ వంటి వ్యాధులు వస్తాయి.  దోమల ద్వారా సంక్రమించే వ్యాధులతో ఏటా 7 లక్షల మంది మరణిస్తున్నారని సర్వేలు వెల్లడిస్తున్నాయి.  దోమ చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ.. ఇది ప్రాణాంతక వ్యాధులను వ్యాప్తి చేస్తుంది. 
 


మానవులు

మనషులకు మనుషులు హాని చేస్తారా? అని డౌట్ రావొచ్చు. కానీ ఇది నిజం. దొంగతనం, యుద్ధం, పోరాటం, హత్య వంటి చాలా సందర్భాల్లో మనుషులు మనుషులను అతి దారుణంగా చంపుతున్నారు. ఇవి మీరు నిత్యం వార్తల్లో చూస్తూనే ఉంటారు. మీకు తెలుసా? ఇలాంటి ఘటనల వల్ల  ఏటా 4 లక్షల మంది చనిపోతున్నారని నిపుణులు చెబుతున్నారు.
 

Cobra snake kota


పాము

పాములు చాలా డేంజర్. ఇవి కూడా మనిషి ప్రాణాలను చాలా సులువుగా తీసేయగలవు. మీకు తెలుసా? పాము కాటుతో ఏటా లక్ష మంది చనిపోతున్నారు. అందుకే మనుషులు పాములకు బాగా భయపడతారు. ఇన్ లాండ్ తపన్, కింగ్ కోబ్రా, బ్లాక్ మాంబా వంటి జాతుల  పాముల విషం ఎంత శక్తివంతమైనదంటే ఇది కాటేసిన కొన్ని గంటల్లోనే మనిషి చనిపోతాడు. అలాగే కొండచిలువలు 10 మీటర్ల పొడవు వరకు ఉంటాయి. అలాగే ఇవి ఈజీగా మనిషిని మింగగలవు. ఇలాంటి ఘటలను అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి. అందుకే మనుషులకు ఇవి ప్రమాదకరంగా పరిగణిస్తారు. ఈ కొండచిలువలు రహస్యంగా దాడి చేస్తాయి . వీటి రంగు వల్ల వీటిని సులువుగా గుర్తించలేము. 

కుక్కలు

విశ్వాసం చూపడంలో కుక్కలే ముందుంటాయి. అందుకే కుక్కలు మనుషులకు అత్యంత నమ్మకమైన సహచరులు అంటారు. కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఇవి కూడా ప్రమాదకరంగా ఉంటాయి. కుక్కల  లాలాజలం వల్ల రేబిస్ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధికి చికిత్స చేయకపోతే ప్రాణాలు కూడా పోతాయి. ఈ వ్యాధి కుక్క కాటు వల్ల వస్తుంది. అయితే ప్రతి సంవత్సరం 59 వేల మంది కుక్క కాటు వల్ల చనిపోతున్నారట. 
 

నత్తలు

ఇంత చిన్న నత్తలు మనుషుల ప్రాణాలు తీస్తాయా? అంటే తీస్తాయనే చెప్పాలి. మంచినీటిలో ఉంటే ఈ నత్తల కారణంగా ఏటా సుమారు 12 వేల మంది మరణిస్తున్నారట. స్కిస్టోసోమియాసిస్ అనే పరాన్నజీవి నత్తలలో కనిపిస్తుంది. ఇది వాటి లాలాజలం ద్వారా చర్మానికి చేరుకుంటుంది. 
 

తేలు

తేల్లను కూడా అంత తేలిగ్గా తీసిపారేయడానికి లేదు. ఇవి కూడా చాలా డేంజర్ జీవులు. మీకు తెలుసా? తేళ్ల వల్ల ఏటా సుమారుగా మూడు వేల మంది మరణిస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి. 25 జాతుల తేళ్లు ప్రాణాంతకమైనవని నిపుణులు అంటున్నారు. ఉత్తర అమెరికా, మధ్యప్రాచ్యంలో ఉండే తేళ్లు చాలా ప్రమాదకరమైనవని నిపుణులు అంటున్నారు. 

Latest Videos

click me!